త్వరలోనే ఆ కమెడియన్ కొడుకుతో యాక్షన్ కింగ్ అర్జున్ కూతురి పెళ్లి?
త్వరలోనే అర్జున్ కూతరు ఐశ్వర్య పెళ్లి జరగబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 26 Jun 2023 5:32 PM ISTత్వరలోనే ఆ హీరోతో యాక్షన్ కింగ్ అర్జున్ కూతురి పెళ్లి?
యాక్షన్ కింగ్ అర్జున్‌కు తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అర్జున్ ఎక్కువగా వార్తల్లో కనిపించరు. ఆయన పని ఆయన చేసుకుపోతారు. కానీ తాజాగా ఆయన కూతురు పెళ్లి విషయంలో సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారారు. త్వరలోనే అర్జున్ కూతరు ఐశ్వర్య పెళ్లి జరగబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఐశ్వర్య కూడా ఇటీవల సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఆమె పెళ్లి వార్తకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.
ఐశ్వర్య అర్జున్ వివాహం ఎవరితో అనేది కూడా సినీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళ నటుడు ఉమాపతి రామయ్యతో ఐశ్వర్య అర్జున్‌తో పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. నేషనల్ అవార్డు విన్నర్, కమెడియన్ తంబి రామయ్య కుమారుడే ఉమాపతి. అతనితో ఐశ్వర్య రిలేషన్‌షిప్‌లో ఉందన్న వార్తలు కూడా హల్‌చల్ చేస్తున్నాయి. కాగా.. వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉండటంతో పెళ్లికి ఇరు కుటంబాల సభ్యులు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఐశ్వర్య, ఉమాపతి పెళ్లి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగబోతుందని సమాచారం. ఈ పెళ్లి వార్తపై అర్జున్ కుటుంబం కానీ.. ఉమాపతి కుటుంబం కానీ స్పందించలేదు. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐశ్వర్య అర్జున్ త్వరలోనే తెలుగు తెరపై ఓ సినిమాలో కనిపించబోతుంది. ఈ సినిమాకు అర్జున్ దర్శకత్వం వహిస్తారు. త్వరలోనే సెట్స్‌పైకి కూడా వెళ్లనుంది.