సిద్ధార్థ్ గురించి అదితిరావు హైదరి ఆసక్తికర కామెంట్స్
తనకు కాబోయే భర్త సిద్ధార్థ్ గురించి అదితిరావు హైదరి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
By Srikanth Gundamalla Published on 7 May 2024 4:59 PM ISTసిద్ధార్థ్ గురించి అదితిరావు హైదరి ఆసక్తికర కామెంట్స్
సినిమా ఇండస్ట్రీలో ఇటీవల సంచలనంగా మారిన జంట హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరి. ఇద్దరూ కొంతకాలం సీక్రెట్ రిలేషన్ తర్వాత.. ఎట్టకేలకు ఎంగేజ్‌మెంట్ అయిపోయినట్లు వెల్లడించారు. వీరిద్దరూ వివాహానికి రెడీ అవ్వడంతో సినిమా ప్రేక్షకులు, నెటిజన్లు అభినందనలు తెలిపారు. కాగా.. తాజాగా తనకు కాబోయే భర్త సిద్ధార్థ్ గురించి అదితిరావు హైదరి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
సిద్ధార్థ్ వల్లే తనకు ప్రేమపై నమ్మకం పెరిగిందని అదితిరావు హైదరి అన్నారు. త్వరలో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టబోతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. కాగా.. తాజాగా అదితిరావు హైదరి నటించిన సినిమా 'హీరామండి' వెబ్‌సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అదితి.. సిద్ధార్థ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సిద్ధార్థ్ పరిచయం తనను ఎంతో మార్చిందని చెప్పారు అదితిరావు హైదరి. అతని వల్లే ప్రేమై నమ్మకం పెరిగిందన్నారు. ఎన్నో విషయాల్లో తన నమ్మకం నిజమైందన్నారు. అయితే.. సిద్ధార్థ్‌ది.. తనది చిన్నపిల్లల మనస్తత్వం అని చెప్పారు. ప్రేమ ఉన్న చోట గౌరవం తప్పకుండా ఉంటుందని అతిది అన్నారు.
తాము ఒకరినొకరు ఎంతో గౌరవించుకుంటామని చెప్పారు. ప్రతి విషయాన్ని తాను పాజిటివ్‌గా తీసుకుంటాననీ.. నటీనటులపై రూమర్స్ రావడం కామన్ అంటూ అదితిరావు హైదరి అన్నారు. అలాగే సిద్ధార్థ్, తనపైనా రూమర్లు వచ్చానీ.. వాటికి చెక్ పెట్టేందుకే నిశ్చితార్ధం విషయాన్ని వెల్లడించామన్నారు. ఈ సందర్భంగా తమకు అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికి అదితిరావు హైదరి కృతజ్ఞతలు చెప్పారు.
మరోవైపు సోషల్ మీడియాలో పలువురు ఫేక్ వార్తలు ప్రచారం చేస్తుంటారని ఆమె అన్నారు. సెలబ్రిటీలు కూడా మనుషులే అనీ గ్రహించాలంటూ సీరియస్ అయ్యారు. తమ చుట్టూ తిరిగి వాళ్ల వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకోవడం తప్పు అని అర్థం చేసుకోవాలన్నారు అదితిరావు హైదరి.