మేం తీసింది రామాయణం కాదు: ఆదిపురుష్ మూవీ రచయిత
ఆదిపురుష్ పై వస్తోన్న విమర్శలకు రచయిత మనోజ్ ముంతశిర్ శుక్లా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. మనోజ్ మాట్లాడుతూ..
By Srikanth Gundamalla Published on 18 Jun 2023 10:36 AM ISTమేం తీసింది రామాయణం కాదు: ఆదిపురుష్ మూవీ రచయిత
భారీ బడ్జెట్‌తో రూపొందించిన చిత్రం ఆదిపురుష్ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంట్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా.. కృతిసనన్ సీతగా కనిపించారు. మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్' జూన్ 16న థియేటర్లలో విడుదలైంది. ఈ క్రమంలో సినిమాలోని కొన్ని సీన్స్‌పై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆదిపురుష్ సినిమా వివాదాల్లో చిక్కుకున్నట్లు అయ్యింది. రామాయణాన్ని వక్రీకరించారని.. కేవలం వీఎఫ్‌క్స్‌తో హాలీవుడ్ చిత్రాల్ని తలపించిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. కొందరైతే రావణాసురుడి గెటప్ సరిగ్గా లేదని.. ఆయనని వక్రీకరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యంతరాలున్న సీన్లను మార్చాలంటూ డిమాండ్స్ వ్యక్తం అవుతున్నాయి. వాటిని మార్చాకే మళ్లీ రిలీజ్ చేయాలంటున్నారు పలువురు.
మిక్స్‌డ్ టాక్ రావడంతో తాజాగా ఆదిపురుష్ సినిమా కథ రచయిత స్పందించారు. ఆదిపురుష్ పై వస్తోన్న విమర్శలకు రచయిత మనోజ్ ముంతశిర్ శుక్లా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. మనోజ్ ముంతశిర్ మాట్లాడుతూ... మేం తీసింది రామాయణం కాదని చెప్పారు. కేవలం రామాయణం నుంచి తాము స్ఫూర్తి పొందామని చెప్పారు. ఈ విషయాన్ని మేం డిస్‌క్లెమర్‌లో కూడా ప్రస్తావించామని వివరించారు. రామాయణంలో జరిగే యుద్ధంలో ఓ భాగం ఆధారంగానే ఆదిపురుష్‌ను తెరకెక్కించినట్లు చెప్పారు. అయితే ఇదే విషయాన్ని చాలా సార్లు చెప్పామని గుర్తు చేశారు రచయిత మనోజ్ ముంతశిర్ శుక్లా. మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తీశామని.. సంపూర్ణ రామాయణం తీయడం తమ ఉద్దేశం కాదని తెలిపారు. ఈ విషయాన్ని సినిమా చూసిన ప్రేక్షకులు, ప్రజలు గమనించాలని కోరారు. కాగా.. ఇప్పటికే థియేటర్లలో రిలీజైన ఆదిపురుష్ సినిమా రామాయణంగానే భావించారు ప్రజలు. కొన్ని సీన్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కొందరైతే గ్రాఫిక్స్ కూడా బాలేదంటూ విమర్శలు చేస్తున్నారు. మరి తాజాగా రచయిత మనోజ్ ఇచ్చిన వివరణపై విమర్శకులు ఎలా స్పందిస్తారో చూడాలి.