'ఆదిపురుష్' మూవీలోని ఆ డైలాగ్స్‌లో మార్పులు..అధికారిక ప్రకటన

ఆదిపురుష్‌ మూవీలోని కొన్ని డైలాగ్స్‌ను మారుస్తున్నట్లు చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ క్రమంలో రచయిత మనోజ్ ముంతాషిర్ శుక్లా..

By Srikanth Gundamalla  Published on  18 Jun 2023 2:41 PM IST
Adipurush, Prabhas, Movie Dialogues change, Om Rout

'ఆదిపురుష్' మూవీలోని ఆ డైలాగ్స్‌లో మార్పులు..అధికారిక ప్రకటన

యంగ్‌ రెబల్‌స్టార్ ప్రభాస్‌ రాముడి పాత్రలో వచ్చిన 'ఆదిపురుష్‌' సినిమా వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. ఓ వైపు మంచి కలెక్షన్లు రాబడుతున్నా.. కొందరు మాత్రం ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో.. వివాదాలకు కేరాఫ్‌గా మారింది ఆదిపురుష్ సినిమా. తాము తీసింది రామాయనం కాదని.. రచయిత పలుసార్లు చెప్పినా.. విమర్శలు ఆగకపోవడంతో చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఆదిపురుష్‌ మూవీలోని కొన్ని డైలాగ్స్‌ను మారుస్తున్నట్లు చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ క్రమంలో రచయిత మనోజ్ ముంతాషిర్ శుక్లా కూడా స్పందించారు. ట్విట్టర్‌లో ఒక ఎమోషనల్‌ పోస్టు పెట్టారు. ప్రతి ఒక్కరి భావోద్వేగాలను గౌరవించడం రామకథ నుంచి నేర్చుకోవాల్సిన మొదటి పాఠం అని నా అభిప్రాయం అని రాసుకొచ్చారు. ఆదిపురుష్‌ సినిమా కోసం 4వేల లైన్లకు పైగా డైలాగులు రాశానని చెప్పారు. వాటిల్లో 5 లైన్లు కొందరిని బాగా బాధించాయని తెలుస్తోందని చెప్పారు. మూవీలోని శ్రీరాముడిని, సీతమ్మను కీర్తిస్తూ చాలా సంభాషణలు ఉన్ఆనయి. కానీ వాటికంటే 5 లైన్లే ఎక్కువ ప్రభావం చూపాయనిపిస్తోందన్నారు. సోదరులు చాలా మంది ఘోరంగా విమర్శిస్తున్నారని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు రచయిత మనోజ్ ముంతాషిర్ శుక్లా. సనాతన ద్రోహి అంటూ ముద్ర వేశారంటూ బాధపడ్డారు. ఆదిపురుష్‌లో గొప్ప పాటలు కూడా తన కలం నుంచే వచ్చాయని.. కానీ అవేవీ చూడకుండా నిందలు వేయడం సరికాదన్నారు. ఏదేమైనా నింద వేయడంలో తొందరపడ్డారని అభిప్రాయం వ్యక్తం చేశారు మనోజ్ ముంతాషిర్ శుక్లా.

ఆదిపురుష్‌ను ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారు. కానీ ఆ డైలాగ్స్‌ను మాత్రమే విమర్షిస్తున్నారు కాబట్టి.. వాటిని మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారు చిత్రయూనిట్. ఒక వారంలో ఈ మార్పులు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పుడున్న ఫీల్‌ను కొనసాగిస్తూనే ఆ మార్చిన సంభాషణలు ఉండనున్నాయి. కొద్ది రోజుల్లోనే మార్పులు థియేటర్లలో చూడొచ్చని ఆదిపురుష్‌ చిత్ర యూనిట్ తెలిపింది. ప్రేక్షకుల మనోభావాలే ముఖ్యమని సినిమా నిర్మాతలు కూడా చెబుతున్నారు.

Next Story