పోలీసులను సెక్యూరిటీ కోరిన 'ఆదిపురుష్' డైలాగ్ రైటర్
ఆదిపురుష్ సినిమా డైలాగ్స్ రచయిత మనోజ్ ముంతశిర్ పోలీసులను ఆశ్రయించాడు.
By Srikanth Gundamalla Published on 19 Jun 2023 11:47 AM GMTపోలీసులను సెక్యూరిటీ కోరిన 'ఆదిపురుష్' డైలాగ్ రైటర్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా నటించిన చిత్రం ఆదిపురుష్ వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. సినిమాలోని కొన్ని డైలాగ్స్‌పై తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయితే..ప్రేక్షకుల మనోభావాలపై స్పందించిన చిత్ర యూనిట్..ఆ డైలాగ్స్‌ను మార్చేందుకు సిద్ధమని చెప్పింది. అయినా కొందరు మాత్రం సినిమాను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. మూవీ టీమ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆదిపురుష్ సినిమా డైలాగ్స్ రచయిత మనోజ్ ముంతశిర్ పోలీసులను ఆశ్రయించాడు.
ఆదిపురుష్‌లో అభ్యంతరకర విషయాలపై మధ్యప్రదేశ్‌లో క్షత్రియకర్ని సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రామాయణాన్ని వక్రీకరిస్తూ కొన్ని డైలాగ్స్ రాశారంటూ వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా డైరెక్టర్ ఓం రౌత్, అలాగే మాటల రచయిత మనోజ్ బయట కనిపిస్తే చంపేస్తామని ఆ సేన జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రాజ్ షెకావత్ హెచ్చరించారు. దీంతో.. ఆదిపురుష్ టీమ్ సభ్యలు మరింత ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే డైలాగ్ రైటర్ మనోజ్ ముంబై పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
MP | Adipurush | क्षत्रिय करणी सेना के नेताओं ने दी फ़िल्म अदिपुरुष के निर्माता ओम राउत और डायलॉग राइटर मनोज मुंटाशिर को पीटने की धमकी।"जहां भी फिल्म आदिपुरुष के डायरेक्टर और राइटर दिखेंगे वहां उन्हें वही मारेंगे। सेना के सदस्य दोनों की तलाश कर रहे हैं," राज शेखावत करनी सेना। pic.twitter.com/k1UKk55maC
— काश/if Kakvi (@KashifKakvi) June 18, 2023
కాగా.. ప్రాణహాని ఉందని తమని ఆశ్రయించిన మనోజ్ విజ్ఞప్తిపై పోలీసుల సానుకూలంగా స్పందించారు. ఆయన భద్రత కోరిన వెంటనే పోలీసులు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అయితే.. పరిస్థితిని తాము పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు ముంబై పోలీసులు. ఈ సందర్భంగా డైలాగ్ రైటర్ మనోజ్ మాట్లాడుతూ తాను రాసిన డైలాగుల్లో తప్పులు లేవని లెక్కలేనన్ని కారణాలు చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. అందరి మనోభావాలను పరిగణనలోకి తీసుకునే అభ్యంతరాలు తెలుపుతోన్న డైలాగ్స్‌ను మార్చేందుకు సిద్ధమయ్యామని చెప్పారు. అయినా కూడా ఇలాంటి బెదిరింపులకు పాల్పడటం ఏమాత్రం సబబు కాదన్నారు మనోజ్ ముంతశిర్. కాగా.. క్షత్రియకర్ని సభ్యుల బెదిరింపులపై డైరెక్టర్ ఓం రౌత్ ఇంకా స్పందించలేదు.