'ఆదికేశవ' సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..ఎక్కడంటే
తాజాగా వైష్ణవ్ ఆదికేశ సినిమాలో నటించాడు. ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
By Srikanth Gundamalla Published on 18 Dec 2023 5:43 PM IST'ఆదికేశవ' సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..ఎక్కడంటే
పంజా వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా పెద్ద హిట్‌గా నిలిచింది. తాజాగా వైష్ణవ్ ఆదికేశ సినిమాలో నటించాడు. జోడీగా టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల నటించింది. అయితే.. ఈ సినిమా థియేటర్లలో విడుదలైనా.. బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేదు. ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శ్రీకాంత్‌రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 22 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఆదికేశవ సినిమా ప్రముఖ నెటిఫ్లిక్స్ ఓటీటీ వేదికగా డిసెంబర్ 22 నుంచి అందుబాటులోకి వస్తుంది. ఈ మూవీలో వైష్ణవ్ తేజ్ పూర్తిగా మాస్ యాంగిల్‌లో కనిపించాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లో నాగ వంశీ, సాయి సౌజన్య ఈ మూవీని నిర్మించారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందించాడు. పెద్ద అంచనాలతోనే ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. కానీ.. సినిమా ప్రేక్షకులను అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. కమర్షియల్ సినిమాగా వచ్చినా.. కలెక్షన్లను పెద్దగా రాబట్టలేదు.
ఓటీటీలు వచ్చాక.. థియేటర్లలో విడుదలైన నాలుగైదు వారాలకే పెద్ద సినిమాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఇక థియేటర్లలో పెద్దగా మెప్పించని సినిమాలు అయితే.. అనూహ్యంగా రెండువారాల్లోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. కాగా.. గత సినిమాల్లో లవర్ బాయ్‌గా.. పక్కింటి కుర్రాడి తరహాలో సాఫ్ట్ క్యారెక్టర్స్ చేసిన వైష్ణవ్ తేజ్.. ఈ మూవీలో మ్యాస్ క్యారెక్టర్‌లో కనిపించాడు. డ్యుయల్ షేడ్స్‌తో సాగే క్యారెక్టర్‌లో మెప్పించాడు. శ్రీలీల గ్లామర్, డ్యాన్సులతో అదరగొట్టింది. కానీ.. సినిమా కథనం మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.