నటి సమంత వైన్‌స్టెయిన్ కన్నుమూత
హాలీవుడ్ నటి సమంత వైన్ స్టెయిన్ కన్నుమూసింది. గత రెండేళ్లుగా అండాశయ క్యాన్సర్‌తో పోరాడుతున్న నటి సమంత
By M.S.R Published on 25 May 2023 7:00 PM ISTనటి సమంత వైన్‌స్టెయిన్ కన్నుమూత
హాలీవుడ్ నటి సమంత వైన్ స్టెయిన్ కన్నుమూసింది. గత రెండేళ్లుగా అండాశయ క్యాన్సర్‌తో పోరాడుతున్న నటి సమంత ఆసుపత్రిలో చనిపోయారు. ఆమ్ వయసు 28 సంవత్సరాలు మాత్రమే. సమంత 10 ఏళ్లకే నటనను కెరీర్‌గా ఎంచుకున్నారు. 2005లో బిగ్ గర్లతో జోసెఫిన్ పాత్రను పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలు సినిమాల్లో నటించి మెప్పించిన సమంత 2022 అక్టోబర్‌లో మైఖేల్ నుట్సన్‌ను పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె పెళ్లైన ఆరు నెలలకే ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణించిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తండ్రి తెలియజేశారు.
సమంత ఇక లేదన్న విషాదాన్ని ఆమె తండ్రి జీర్ణించుకోలేకపోతున్నారు. 'తను ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటుంది. తనతో కాసేపు కలిసి మాట్లాడితే చాలు ఆ పాజిటివ్ వైబ్స్ వస్తాయని చాలామంది చెప్తూ ఉంటారు' అని తెలిపారు. ఆమె కుటుంబం సమంతకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలో ఒక ప్రకటనను విడుదల చేసింది. "మే 14వ తేదీ ఉదయం 11:25 గంటలకు టొరంటోలోని ప్రిన్సెస్ మార్గరెట్ హాస్పిటల్‌లో ఆమె ప్రియమైన వారు చుట్టూ ఉండగా తుది శ్వాస విడిచింది." అని అధికారిక ప్రకటనలో ఉంది.