బాలీవుడ్ సినీ ఇండస్ట్రీపై కాంతారా మూవీ హీరో సంచలన కామెంట్స్

'కాంతార' సినిమా పెద్ద హిట్‌గా నిలిచింది.

By Srikanth Gundamalla
Published on : 21 Aug 2024 6:26 AM

actor Rishab Shetty, sensational comments, Bollywood industry,

 బాలీవుడ్ సినీ ఇండస్ట్రీపై కాంతారా మూవీ హీరో సంచలన కామెంట్స్

'కాంతార' సినిమా పెద్ద హిట్‌గా నిలిచింది. ఆ సినిమాతో టాక్‌ ఆఫ్‌ది గ్లోబల్ ఇండస్ట్రీగా నిలిచాడు కన్నడ హీరో రిషబ్‌ శెట్టి. అయితే.. మంచి ప్రతిభ ఉన్న హీరో, డైరెక్టర్‌గా ఇప్పటికే ప్రూవ్‌ చేసుకున్నాడు. కాంతార సినిమాకు సీక్వెల్‌ను కూడా తీస్తున్నాడు రిషబ్‌ శెట్టి. కాంతార మొదటి పార్ట్‌ బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులను అందుకుంది. ఇక కన్నడలోనే కాదు.. అన్ని భాషల్లోనూ ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. కాంతార సినిమాలో నటనకు గాను రిషబ్‌ శెట్టి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును కూడా దక్కించుకున్నాడు. చలనచిత్ర పురస్కారాల్లో అవార్డును అందుకున్నాడు. ఉత్తమ ప్రేక్షక ఆదరణ పొందిన చిత్రంగా కాంతార సినిమా నిలిచింది. గొప్ప సినిమా తీశాడంటూ రిషబ్‌ శెట్టిపై ప్రశంసలు కురిపిస్తున్న నేపథ్యంలో..తాజాగా సంచలన కామెంట్స్ చేశాడు.

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీపై హీరో రిషబ్‌ శెట్టి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో భారతదేశాన్ని బాలీవుడ్‌ చిత్రాలు తక్కువ చేసి చూపిస్తున్నాయని అన్నారు. ఇటీవల రిషబ్‌ శెట్టి ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ సందర్భంగా ఈ సంచలన కామెంట్స్ చేశాడు. 'భారతీయ సినిమాలు, ముఖ్యంగా బాలీవుడ్‌ చిత్రాలు భారతదేశాన్ని తక్కువ చేసి చూపిస్తున్నాయి. ఈ కళాత్మక చిత్రాలను గ్లోబల్‌ ఈవెంట్‌లకు ఆహ్వానిస్తారు. రెడ్‌ కార్పెట్‌తో స్వాగతం పలుకుతారు. నా దేశం, నా రాష్ట్రం, నా భాష.. వీటన్నింటి గురించి సానుకూలంగా ఎందుకు చూపించకూడదు..? దేశం గర్వపడేలా సినిమాలు తీయాలని ప్రయత్నిస్తున్నాను. నా సినిమాల ద్వారా భారతదేశాన్ని పాజిటివ్‌ నోట్‌లో చూపించాలనుకుంటున్నా’ అని రిషబ్‌ శెట్టి ఇంటర్యూలో చెప్పుకొచ్చాడు. రిషబ్‌ శెట్టి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేగుతున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు.. పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

Next Story