ప్రముఖ నటుడు నాజర్ ఇంట విషాదం
ప్రముఖ నటుడు నాజర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. నాజర్ తండ్రి మెహబూబ్ బాషా (94) కన్నుమూశారు.
By Srikanth Gundamalla Published on 10 Oct 2023 5:42 PM ISTప్రముఖ నటుడు నాజర్ ఇంట విషాదం
ప్రముఖ నటుడు నాజర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. నాజర్ తండ్రి మెహబూబ్ బాషా (94) కన్నుమూశారు. గత కొంతకాలంగా మెహబూబ్ బాషా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వృద్ధాప్యంతో ఆయన పరిస్థితి విషమించడంతో ఇవాళ ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులోని చెంగల్పట్టులో తన నివాసంలో నాజర్ తండ్రి తుది శ్వాస విడిచారు. కాగా.. మెహబూబ్ బాషా మృతిచెందిన విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. పితృవియోగంతో బాధపడుతున్న నాజర్‌కు బంధుమిత్రులు, అనేక మంది సినీ ప్రముఖులు సానుభూతి తెలుపుతున్నారు. కాగా.. మెహబూబ్ బాషా అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నారు.
నాజర్ నటుడిగా రాణించడానికి.. నటనలో స్థిరపడటానికి కారణం ఆయన తండ్రేనట. తండ్రి కోరికమేరకే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో నాజర్ చేరారు. ఆ తర్వాత దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడిగా కొనసాగుతున్నారు. అయితే.. నటనలో శిక్షణ పూర్తిచేసుకున్న తర్వాత వెంటనే అవకాశాలు లభించలేదు నాజర్‌కు. చాలాకాలం పాటు ఇబ్బందులు పడ్డారు. కానీ నటన పట్ల తాను ప్రయత్నాలు కొనసాగిస్తూనే వచ్చారు. ఆయన కొంతకాలం ఓ స్టార్ హోటల్‌లో సప్లయర్‌గా కూడా పనిచేశారు. తండ్రి కోరిక, ఆశీస్సుల మేరకు సినిమాల్లో అవకాశాలు లభించాయి... నటనతో తనని తాను నిరూపించుకున్నారు నాజర్.
ఇక ఇటు తెలుగు సినిమాలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుటుంబంలో కూడా విషాదం నెలకొంది. దిల్‌రాజు తండ్రి అక్టోబర్ 9వ తేది రాత్రి 8.30 గంటలకు అనారోగ్యంతో చికిత్స ఆస్పత్రిలో పొందుతూ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే.. తండ్రిపోయిన దుఃఖంలో ఉన్న దిల్‌రాజుని ఇవాళ సినీ ప్రముఖులు వెళ్లి ఆయన్ని పరామర్శించారు.