తెల్ల‌వారుజామున 3గంట‌ల‌కు.. విమానం కోసం మ‌హేష్‌బాబు.. ఫోటో వైర‌ల్‌

Actor Mahesh babu Photo viral I సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, న‌మ‌త్ర దంప‌తులు ఎంత అన్యోన్యంగా

By సుభాష్  Published on  17 Nov 2020 6:39 AM GMT
తెల్ల‌వారుజామున 3గంట‌ల‌కు.. విమానం కోసం మ‌హేష్‌బాబు.. ఫోటో వైర‌ల్‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, న‌మ‌త్ర దంప‌తులు ఎంత అన్యోన్యంగా ఉంటారో అంద‌రికి తెలిసిందే. మ‌హేష్ షూటింగ్స్‌తో బిజీగా ఉన్న‌ప్ప‌టికి కూడా ఫ్యామిలీకి స‌మ‌యాన్ని కేటాయిస్తారు. స‌మ‌యం దొరికితే.. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి విదేశాల్లో విహారం చేయ‌డం మ‌హేష్ కు అల‌వాటు. ఇక నమ్ర‌త.. సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో ట‌చ్‌లో ఉంటుంది. త‌న భ‌ర్త‌, పిల్ల‌ల‌కు సంబంధించిన చిన్న చిన్న విష‌యాల‌ను, ఫోటోల‌ను అభిమానుల‌తో పంచుకుంటుంది.

లాక్‌డౌన్ కాలంలో ఇంట్లోనే ఉన్న మ‌హేష్.. ప్ర‌స్తుతం ఖాళీ దొర‌క‌డంతో కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి విదేశాల్లో విహ‌రిస్తున్నారు. తాజాగా న‌మ్ర‌త పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఫొటోలో మహేష్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. స్టైలిష్ గా గాగుల్స్ ధరించి కిరాక్ లుక్ కనిపిస్తున్నాడు. 'తెల్లవారు జామున 3 గంటలకు విమానం కోసం ఎదురుచూస్తోన్న మహేశ్ బాబు' అంటూ ఆమె ఈ ఫొటోను పోస్ట్ చేసింది. ఎయిర్ పోర్ట్ లో ఫ్లైట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఇలా క్లిక్ మనిపించారు నమ్రత. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

మ‌హేష్ ప్ర‌స్తుతం సర్కారు వారి పాట చిత్రంలో న‌టిస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మ‌హేష్ స‌ర‌స‌న కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ చిత్రంలో మహేష్ చాలా డిఫరెంట్ గా కనిపించనున్నాడని తెలుస్తుంది. అందుకోసమే జుత్తు పెంచారు. ఇక ఆ మధ్య విడుదల చేసిన మోషన్ పోస్టర్ లో మహేష్ మెడ పైన రూపాయి టాటూ అందరిని ఆకర్షించింది.

Next Story
Share it