ఉమెన్స్ డే స్పెషల్.. రూ.100కే సినిమా టికెట్
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ మహిళల కోసం ఓ స్పెషల్ ఆఫర్‌ను ప్రకటించాడు.
By Srikanth Gundamalla Published on 8 March 2024 2:30 PM ISTఉమెన్స్ డే స్పెషల్.. రూ.100కే సినిమా టికెట్
మార్చి 8న అంతర్జాతీయ మహిళల దినోత్సవం. ఈ సందర్బంగానే బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ మహిళల కోసం ఓ స్పెషల్ ఆఫర్‌ను ప్రకటించాడు. అమీర్‌ఖాన్ నిర్మాతగా తాజాగా 'లాపటా లేడీస్' అనే సినిమాను తీశాడు. అయితే.. ఈ సినిమాను ఉమెన్స్ డే సందర్భంగా కేవలం రూ.100కే థియేటర్లలో వీక్షించవచ్చని చెప్పాడు. అయితే.. మార్చి 8వ తేదీన ఒక్కరోజు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది.
అమీర్‌ఖాన్ ప్రొడక్షన్‌లో వచ్చిన కొత్త సినిమా ‘లాపటా లేడీస్’. ఈ మూవీకి డైరెక్టర్‌గా అమీర్‌ఖాన్ మాజీ భార్య కిరణ్‌రావు దర్శకత్వం వహించారు. జమ్తారా వెబ్‌సిరీస్ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ్ ఇందులో హీరోగా నటించారు. భోజ్‌పురి నటుడు రవికిషన్ కీలక పాత్రలో కనిపించారు. మార్చి 1వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీకి బాలీవుడ్‌లో మంచి పాజిటివ్ రావడంతో కలెక్షన్లలో దూసుకెళ్తుంది. ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరు చాలా రోజులకు మంచి కంటెంట్ ఉన్న సినిమా చూశామంటున్నారు. అయితే. మంచి రెస్పాన్స్ ఉన్న సినిమా.. లేడీస్ స్పెషల్ డే కావడంతో అమీర్‌ఖాన్ ఈ ఆఫర్‌ను ప్రకటించారు. మహిళలు ఈ ఒక్కరోజుకు రూ.100కే టికెట్ బుక్ చేసుకుని సినిమా చూసేయండి చెప్పాడు.
Special offer to watch our #LaapataaLadies with your ladies now in your near cinemas, to aa rahe hai naa aap? 🌸
— Aamir Khan Productions (@AKPPL_Official) March 6, 2024
Book your tickets now - https://t.co/NPtpfgM1mT@nitanshi_goel @PratibhaRanta #SparshShrivastava @ravikishann #Aamirkhan #KiranRao #JyotiDeshpande @AKPPL_Official… pic.twitter.com/6FLL3xEFtR