ఏపీలో 1 నుంచి 6 వరకే ఆంగ్లమాధ్యమం.. సీఎం జగన్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Nov 2019 6:02 AM GMT
ఏపీలో 1 నుంచి 6 వరకే ఆంగ్లమాధ్యమం.. సీఎం జగన్‌

అమరావతి: ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమంలో బోధించాలన్న నిర్ణయంపై ప్రభుత్వం స్పల్ప మార్పు చేసింది. తొలుత 1 నుంచి 8 వ తరగతి వరకూ ఆంగ్లమాధ్యమంలో బోధించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కొంత సవరించింది. 1 నుంచి 6 వ తరగతి వరకూ మాత్రమే వచ్చే సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది ఈ మేరకు అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించి..ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఈ అంశంపై ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు.

దీంతో పాటు ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ ఆంగ్ల ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని అధికారులన్నారు. వీటిని 'నాడు-నేడు'లో భాగంగా అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలలో బోధనకు సీబీఎస్ఈ, ఐసీఎస్‌ఈ విధానాలను పాటించాలని చెప్పారు.

Next Story
Share it