ఇంకా దొరకని ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఆచూకీ..!

By Newsmeter.Network  Published on  29 Nov 2019 7:03 AM GMT
ఇంకా దొరకని ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఆచూకీ..!

నారాయణగూడ: ఓ లేడిస్‌ హాస్టల్‌లో ఇంజినీరింగ్‌విద్యార్థిని అదృశ్యం మిస్టరీగానే మిగిలింది. నిజామాబాద్‌ నవీన్‌పేటకు చెందిన మోనిక నారాయణగూడలోకి ఓ ఇంజినీరింగ్‌ కాలేజీలో మొదటి సంత్సరం చదుతుంది. కాగా.. బుధవారం ఉదయం ఆమె సోదరుడు ఫోన్‌ చేయగా.. స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దీంతో ఆమె సోదరుడు హాస్టల్లోని మరో యువతికి ఫోన్‌ చేశాడు. అయితే ఉదయాన్నే తాను వెళ్లిపోయినట్లు ఆమె తెలిపింది. కాగా.. హాస్టల్‌ రూమ్‌లో నేను ట్యాంకుబండ్ లో దూకి చచ్చిపోతున్న...! నా శవాన్ని తీసుకెళ్ళు నాన్న..!! అంటూ రాసిన సూసైడ్ నోట్ దొరికింది.

దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు చేరుకొని.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా మణిరత్నం అనే వ్యక్తి తన కూతురిని మానసికంగా వేధిస్తున్నట్లు తమకు చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. లేఖను చదివిన పోలీసులు లేక్‌ పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం మోనిక ఉంటున్న హాస్లల్లోని సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఆమె ఆటో ఎక్కి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే ట్యాక్‌బండ్‌పై ఉన్న సీసీ కెమెరాల్లో ఆమె నడుస్తూ వెళ్లిన దృష్యాలు కనిపించినట్లు పోలీసులు చెప్పారు. దీంతో మోనిక కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్లు నారాయణగూడ పోలీసులు తెలిపారు.

Next Story