గున్న ఏనుగును ఎలా కాపాడారంటే..

By సుభాష్  Published on  2 Feb 2020 2:59 AM GMT
గున్న ఏనుగును ఎలా కాపాడారంటే..

ప్రమాదవశాత్తు బావి లోపల పడిపోయిన ఒక గున్న ఏనుగును ఆర్కిమెడిస్ సూత్రాన్ని ఉపయోగించి జార్ఖండ్‌లోని అటవీ అధికారులు బయటకు లాగారు. గ్రామస్తుల సహాయంతో దానిని రక్షించారు. జార్ఖండ్ లోని గుమ్లా జిల్లాలో ప్రమాదవశాత్తు ఏనుగు పిల్ల బావి లో పడింది. ఆ బావి ఏనుగంత మందమే ఉండటంతో పైకి లాగటం చాలా కష్టం గా తోచింది. దాన్ని ఎలా బయటకు లాగాలా అని తర్జనభర్జనలు పడ్డ ఫారెస్ట్ అధికారులకు సడన్ గా ఆర్కిమెడిస్ గుర్తుకు వచ్చాడు. అతనే కదా చెప్పాడు. ఒక వస్తువు ద్రవంలో పూర్తిగా మునిగినపుడు వస్తువుపై కలుగజెయబడిన ఊర్థ్వ ఒత్తిడి ఆ వస్తువు కోల్పోయిన ద్రవ భారవుతో సమానంగా ఉంటుందని. ఇదే సూత్రం ఆధారంగా వారు నూతిలోకి నీళ్లు పోశారు. నూతిలో బురద ఎక్కువగా ఉండటంతో సహజంగానే ఆ నీటి సాంద్రత ఏనుగు కంటే ఎక్కువగా ఉంది. దీంతో ఆ ఏనుగు నీటిలో తేలడం ప్రారంభించింది. అలా అందులో నీటి స్థాయి పెరుగుతూ వచ్చింది. దానితోపాటు ఏనుగు తేలుతూ పైకి వచ్చింది. ఎలాగైతేనేం ఏనుగు ప్రాణాలు కాపాడారు. ఆ తర్వాత వల సహాయంతో దాన్ని బయటకు లాగారు.

బావి నుండి ఏనుగును రక్షించిన చిత్రాలను భారత అటవీ సేవా అధికారి రమేష్ పాండే ట్విట్టర్‌లో పోస్ట్ చేసి వారిని అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. అటవీ శాఖ అధికారుల తీరుని, ఆ సూత్రం ఉపయోగించాలి అనే ఆలోచనను నెటిజన్లు కొనియాడుతున్నారు. ఫిజిక్స్ పాఠం సమయంలో పిల్లలకు చూపించడానికి ఇది ok గొప్ప ఉదాహరణ అని, వారు సైన్స్ & ప్రేమ రెండింటినీ ఒకేసారి నేర్చుకుంటారుని కామెంట్ చేసారు.



Next Story