షావోమి ఎలక్ట్రిక్ టూత్ బ్రష్.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Jun 2020 10:02 AM GMT
షావోమి ఎలక్ట్రిక్ టూత్ బ్రష్.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే..

మన బామ్మల కాలంలో ఇంట్లో పనంతా స్వయంగా చేసుకునేవారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ మెషీన్లు అప్పట్లో ఉండేవి కావు. అందుకే ఆ కాలంనాటి వాళ్లంతా చాలా స్ట్రాంగ్ గా ఉంటారన్న మాటలు చాలా మంది వినే ఉంటారు. ఇది నిజమే కదా..ఇంట్లో పని చేయడమే వాళ్లకి వ్యాయామంతో సమానం. ఇప్పుడైతే బిజీ బిజీ సమయంలో వ్యాయామానికి కూడా ఇంత సమయం కేటాయించాల్సిన పరిస్థితి. ఇల్లు క్లీన్ చేసేందుకు ఒక మెషీన్, బట్టలుతికేందుకు ఒక మెషీన్, ఆఖరికి ఆ బట్టలను మడతపెట్టే మెషీన్లు కూడా త్వరలోనే రానున్నాయి. మట్టికుండలో నీళ్లు తాగడం మానేసి చాలాకాలమే అవుతోంది కదూ..ఇప్పుడు మన పళ్లు తొమేందుకు కూడా ఒక ఎలక్ట్రానిక్ బ్రష్ ను తయారు చేసింది Xiaomi.

ఇప్పటి వరకూ Xiaomi నుంచి ఫోన్లు, టీవీలను మాత్రమే చూశాం. ఇప్పుడు ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ కూడా వచ్చేసింది. మాన్యువల్ బ్రషింగ్ నుంచి ప్రో బ్రషింగ్ కు మారండంటూ ఏడు సెకన్ల వీడియోను విడుదల చేసిన ఎంఐ..త్వరలోనే ఈ బ్రష్ ను మార్కెట్ లోకి తీసుకురానుంది. అయితే ఎంఐ నుంచి ఇది రెండో ఎలక్ట్రిక్ బ్రష్. 2020 ఆరంభంలోనే ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ను మార్కెట్లోకి విడుదల చేయగా..దాని ధర రూ.1299 గా ఉంది. ఈ బ్రష్ లో ఉండే 700 ఎంఏహెచ్ లిథియం బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే..25 రోజులు పనిచేస్తుంది. అంతేకాదు నిమిషానికి 31 వేల వైబ్రేషన్లతో మీ నోటిని బాగా శుభ్రం చేసేస్తుందట ఈ బ్రష్. త్వరలో మార్కెట్లోకి రానున్నది దీనికి అప్ డేట్ వర్షన్.



Next Story