కోవిడ్ నేపథ్యంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ఆపలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఎన్నికలను
రద్దు చేసేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ పై శుక్రవారం సుప్రీం
కోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.. ఇలాంటి కరోనా సమయంలో
ఎన్నికలు నిర్వహించడం సరైంది కాదు.. ఎన్నికలను ఆపాలంటూ కొందరు దేశ అత్యున్నత
న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. కోవిడ్ సాకుతో
ఎన్నికలను అడ్డుకోలేమని, అంతేకాకుండా ఎన్నికల అధికారాలను ప్రశ్నించలేమని కోర్టు తీర్పు తేల్చి చెప్పింది.

బీహార్ ఎన్నికలకు సంబంధించి ఇంత వరకు నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు. సీఈసీకి తామేమి
ఆదేశాలు ఇవ్వలేమని, కమిషనర్ అన్ని పరిగణలోకి తీసుకుంటారని స్పష్టం చేసింది. ఎన్నికల
నోటిఫికేషనే జారీ కాలేదు.. అందుకే పిటిషన్కు అర్హత లేదని, అలాంటి సమయంలో ఎన్నికలు
నిర్వహించవద్దని ఈసీని ఎలా ఆదేశిస్తామని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికల వాయిదాకు కరోనా
సరైన కారణం కాదని తెలిపింది.

కాగా, ఈ ఏడాది నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు రద్దు
చేయాలని దాఖలైన పిటిషన్ పై తీర్పునిచ్చింది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *