ఏపీలో 8కి చేరిన కరోనా కేసులు

ఏపీలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 8కి చేరింది. తాజాగా చిత్తూరు జిల్లాలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8కి పెరిగింది. శ్రీకాళహస్తికి చెందిన ఓ వ్యక్తి ఇటీవలే ఇంగ్లండ్ నుంచి వచ్చాడు. అతడు కరోనా లక్షణాలతో స్విమ్స్ ఆస్పత్రిలోో చేరగా..వైద్యులు అతడి నుంచి రక్తనమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. తాజాగా వచ్చిన రిపోర్టులో కరోనా పాజిటివ్ అని ఉండటంతో..అతడికి కరోనా సోకినట్లు గుర్తించారు.

Also Read : 12 నిమిషాలకో బాధితుడు మృతి

ప్రపంచ వ్యాప్తంగా సుమారు 200 దేశాలకు కరోనా సోకగా..4 లక్షల మంది కరోనా బంధీలయ్యారు. 17 వేలమందికి పైగా బాధితులు మరణించగా..సుమారు లక్షమంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరారు. వైరస్ బారీ నుంచి కోలుకున్నప్పటికీ మరో 14 రోజులపాటు వారంతా క్వారంటైన్ లో ఉండాల్సిందేనని వైద్యులు సూచించారు. భారత్ లో ఇప్పటి వరకూ 519 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. 10 మంది కరోనాతో మృతి చెందారు. తెలంగాణలో మరో ఇద్దరికి కరోనా నిర్థారణవ్వడంతో కరోనా బాధితుల సంఖ్య 36కు చేరింది. వీరిలో ఒకరు కోలుకున్నారు. కాగా..మంగళవారం ఒక్కరోజే తెలంగాణలో 3 కరోనా కేసులు నమోదవ్వడం..రాష్ట్ర ప్రజలను కలవరపెడుతోంది.

Also Read : యుగయుగాల ఉగాది

దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 100 కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర తర్వాత కేరళలో 96 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా..మరో 21 రోజుల వరకూ ఇండియా లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం సాయంత్రం ప్రకటించారు. దయచేసి ఎవ్వరూ ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *