ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్‌ మృతి

By అంజి  Published on  26 Feb 2020 4:38 AM GMT
ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్‌ మృతి

ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్‌ మరణించారని ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 91 సంవత్సరాల వయసున్న ఆయన అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరి మంగళవారం కన్నుమూశారని తెలిపింది. ముబారక్‌ 30 ఏళ్లపాటు ఈజిప్టు దేశాధ్యక్షుడిగా ఉన్నారు. ఇతను అమెరికాకు మంచి మిత్రుడు, ఇస్లామిక్ ఉగ్రవాదానికి వ్యతిరేకి.

Egypt former President Mubarak passed away

అయితే 2011లో ముబారక్‌కు వ్యతిరేకంగా వేల మంది యువత 18 రోజుల పాటు ఆందోళనలు జరుపగా సైన్యం ఒత్తిడి మేరకు అదే ఏడాది ఫిబ్రవరి 11న అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు. 900 మంది మరణానికి కారణమయ్యారన్న అభియోగాలపై ఏప్రిల్‌లో అరెస్ట్‌ చేయగా 2012 జూన్‌లో దిగువ న్యాయస్థానం దోషిగా నిర్దారించి యావజ్జీవ ఖైదు విధించింది. 2014లో ఉన్నత న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. అవినీతి ఆరోపణల కేసులో ముబారక్‌, ఆయన ఇద్దరు కొడుకులకు మూడేండ్ల జైలుశిక్ష పడగా 2017లో విడుదలయ్యారు.

Egypt former President Mubarak passed away

Next Story