జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 ఫలితాలు విడుదల

జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 పరీక్షల ఫలితాలను విడుదల చేసింది నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ.

By Srikanth Gundamalla  Published on  19 May 2024 8:00 AM GMT
JEE main paper-2,  results, study,

 జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 ఫలితాలు విడుదల 

జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 పరీక్షల ఫలితాలను విడుదల చేసింది నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ. బీఆర్ఎస్‌, బీప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 పరీక్షలు నిర్వహించారు. కాగా.. రెండు విభాగాల్లో ఇద్దరు చొప్పున విద్యార్తులు వంద పర్సంటైల్‌ సాదించారు. వారిలో ఒకరు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు కావడం విశేషం. పరీక్ష రాసిన విద్యార్థులు ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.ac.inలో తమ ఫలితాలను చూసుకోవచ్చని అధికారులు చెప్పారు.

కాగా.. జేఈఈ మెయిన్ పేపర్‌-2 పరీక్షలు ఏప్రిల్ 12వ తేదీన నిర్వహించారు. ఏడు రోజులకే ఫలితాలను ప్రకటించారు. దేశవ్యాప్తంగా జరిగిన ఈ పరీక్ష కోసం 291 కేంద్రాలను ఏర్పాటు చేశారు. బీఆర్క్‌ పరీక్షకు 36,707 మంది విద్యార్థులు హాజరుకాగా.. బీప్లానింగ్‌ పరీక్షను 16,228 మంది విద్యార్థులు రాశారు. మొత్తంగా 73,362 మంది విద్యార్థులు బీఆర్క్‌కు అప్లై చేసుకోగా.. 38,105 మంది బీప్లానింగ్ పరీక్షకు రిజిస్టర్‌ చేసుకునారు. తక్కువ మంది మాత్రమే పరీక్షకు హాజరు అయ్యి రాశారు.

ఇక బీఆర్క్‌ పరీక్ష ఫలితాల్లో జార్ఖండ్‌కు చెందిన బసాక్, తమిళనాడుకు చెందిన ముత్తు అనే విద్యార్థులు ఇద్దరు 100 పర్సంటేజ్‌ సాధించారు. ఇక ఏపీకి చెందిన యాయవరం శ్రవణ్‌ రామ్‌, తెలంగాణ విద్యార్థులు వివేక్‌జిత్‌ దాస్, బోడ ప్రభంజన్‌ జాదవ్, బానోత్‌ రిత్వక్‌ 99 పర్సంటైల్‌ స్కోర్‌ సాధించారు. అలాగే బీప్లాన్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాకేత్ ప్రణవ్‌ 100 పర్సంటైల్‌ సాధించాడు. ఇతనితో పాటు కర్ణాటక విద్యార్థి కూడా వంద పర్సంటైల్ సాధించాడ. మరో ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థి కాలిగట్ల దేవీప్రసాద్ 99.99 పర్సంటైల్ సాధించాడు.

Next Story