CBSE 12వ తరగతి ఫలితాలు విడుదల
లక్షల మంది విద్యార్థులు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) పన్నెండో తరగతి ఫలితాల కోసం ఎదురుచూశారు.
By Srikanth Gundamalla
CBSE 12వ తరగతి ఫలితాలు విడుదల
దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) పన్నెండో తరగతి ఫలితాల కోసం ఎదురుచూశారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ ఫలితాల పట్ల ఆసక్తి చూపారు. ఈ క్రమంలోనే CBSE అధికారులు పన్నెండో తరగతి ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు ఈ ఫలితాలను తెలుసుకునేందుకు cbse.gov.in, https://cbseresults.nic.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించండి. రోల్ నెంబర్‌తో పాటు పుట్టిన రోజు.. స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డు నెంబర్లను ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలను పొందవచ్చు.
దీంతో పాటుగా డీజీలాకర్, ఉమాంగ్ మొబైల్ యాప్‌ల ద్వారా కూడా సీబీఎస్‌ఈ పన్నెండో తరగతి ఫలితాలను పొందవచ్చు. ఈ ఏడాది 12త తరగతిలో మొత్తం 87.98 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అమ్మాయిలు 91.52 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 85.12 శాతం మంది ఉత్తీర్ణతను సాధించారు. 1.16 లక్షల మంది విద్యార్థులకు 90 శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. ఇందులో 24,068 మంది విద్యార్థులు 95 శాతానికి పైగా స్కోరు సాధించినట్లు బోర్డు వెల్లడించింది. తిరువనంతపురంలో 99.91 శాతం, విజయవాడలో 99.04 శాతం, చెన్నైలో 98.47 శాతం, బెంగళూరులో 96.95 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు 12వ తరగతి పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.