ఓ వైపు క‌రోనా విల‌య తాండ‌వం.. మ‌రోవైపు భూకంప భ‌యం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 April 2020 4:26 AM GMT
ఓ వైపు క‌రోనా విల‌య తాండ‌వం.. మ‌రోవైపు భూకంప భ‌యం

కరోనాతో విలవిలలాడుతున్న అమెరికాను భూకంపం మరింత భయపెట్టింది. ఇదాహో రాష్ట్ర వ్యాప్తంగా ఈ భూకంపం సంభవించిందని… మంగళవారం సాయంత్రం 20-30 సెకన్‌ల పాటు భూమి కంపించిందని… బోయిస్‌ ఈశాన్యంగా ఈ భూకంప కేంద్రం ఉందని అధికారులు తెలిపారు. దీని తీవ్రత 6.5 గా ఉందని నేషనల్‌ వెదర్‌ సర్వీస్‌ ప్రకటించింది. భూమి కంపించడంతో భయంతో ప్రజలు పరుగులు తీశారు. లాక్‌డౌన్‌తో ఇంట్లో కూర్చొని పని చేసుకుంటున్నప్పటికీ తాము భయానికి గురి కావాల్సి వచ్చిందని అంటున్నారు. కొంతమంది ఇంట్లో వస్తువులు కదులుతుండగా తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.



కరోనా నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకుంటున్న తరుణంలో భూకంప భయాలు గందరగోళం సృష్టించాయి. ప్రజలు ప్రాణభయంతో పరుగులు పెట్టడం సరే గానీ ఆ సమయంలో కూడా దూరం దూరంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.





Next Story