తాడేపల్లి: మంగళగిరి ఎమ్యెల్యే ఆళ్ళరామకృష్ణారెడ్డి ఇంటిముందు యానిమేటర్లు ఆందోళన నిర్వహించారు. రావాలి ఆర్కే , సమాదానం చెప్పాలి ఆర్కే అంటూ.. ఇంటి ముందు నిరసనకు దిగారు.

అయితే రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థలో పని చేస్తున్న డ్వాక్రా యానిమేటర్లు  ఉద్యోగులను తొలగిస్తూ..ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిని యానిమేటర్లు  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిలో భాగంగానే ఎమ్మెల్యే ఆళ్ళరామకృష్ణారెడ్డి ఇంటి ముందు నిరసనకు దిగారు. వెంటనే ఈ జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కాగా.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత హామీలు అమలుచెయ్యలేదని ఆరోపించారు. అంతే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా 27 వేల మంది యానిమేటర్ల ఉద్యోగాలు ఊడగొట్టేందుకు సర్క్యులర్ జారీ చెయ్యటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.