ఫాం హౌస్‌లో పేడ ఎత్తిన ఉపాసన.. ఆసక్తికర ట్వీట్..!
By Newsmeter.Network Published on 15 May 2020 8:12 AM ISTమెగా కోడలు ఉపాసన ఫాం హౌస్‌లో సందడి చేసింది. తండ్రితో కలిసి ఫాం హౌస్‌కు వెళ్లిన ఆమె పేడను ఎత్తి ఆ ఫొటోలను ట్విటర్‌లో పోస్టు చేసింది. ట్విటర్‌లో ఉపాసన ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. ఏదోఒక ఆసక్తికరమైన ట్వీట్లు పెడుతూఉంటుంది. తాజాగా ఆమె తన తండ్రితో కలిసి ఫార్మ్ హౌస్‌కి వెళ్లిన సందర్భంగా అక్కడ చేసిన పనులను ఫొటోలతో ట్విటర్‌లో పోస్టు చేసింది. అక్కడ ఉన్న ఆవు, దూడలతో మమేకమైన ఉపాసన.. ఆవుపేడను ఎత్తి పక్కన పడేసింది. 'తండ్రితో పేడ అమ్మాయి అంటూ' సరదా ట్వీట్ పెట్టింది. తాను ఆధునిక తరం రైతును అంటూ అభివర్ణించుకుంది.
Also Read :నేడు ఉన్నతస్థాయి అధికారులతో కేసీఆర్ సమీక్ష..లాక్‌డౌన్ సడలింపులపై ఉత్కంఠ
సేంద్రియ వ్యవసాయం ఎలాగో నేర్చుకుంటున్నాను.. ఎరువు తయారు చేయడం, ఆహార వ్యర్థాలను సద్వినియోగం చేసుకోవటం ఎలాగో శిక్షణ పొందుతున్నాను అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చూసిన మెగా అభిమానులు సంతోషంతో రీ ట్వీట్‌లు చేస్తున్నారు. సూపర్ మేడం అంటూ కితాబు ఇస్తున్నారు. ఎక్కడ గర్వం లేకుండా మన పని మనం చేసుకొని ఒక మంచి సందేశం ఇవ్వటం మెగాఫ్యామిలీలో ఉన్న నైజం మేడం.. అందుకే మిమ్మలను అంతగా ప్రజలు ప్రేమించేది అంటూ ట్వీట్ చేస్తున్నారు.