రోజు ఎండు కొబ్బరి తింటే పురుషుల్లో అవి పెరుగుతాయి

By సుభాష్  Published on  29 Jan 2020 9:42 PM IST
రోజు ఎండు కొబ్బరి తింటే పురుషుల్లో అవి పెరుగుతాయి

పురుషుల్లో మగతనాన్ని పెంచే లక్షణం ఎండుకొబ్బరిలో ఉందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఎండుకొబ్బరి సంతానలేమిని దూరం చేసేస్తుంది. స్పెర్మ్‌ కౌంట్ కూడా పెంచుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా వంధత్వాన్ని నివారిస్తుందని, ఇందుకు కారణం డ్రై కోకోనట్‌లోని సెలీనియమే కారణమంటున్నారు.

రోజు ఎండుకొబ్బరి తినేవాళ్లు క్యాన్సర్‌ బారిన పడకుండా ఉంటారని, ఈ వ్యాధి సోకినవాళ్లు కూడా ఎండుకొబ్బరి తింటే ఉత్తమ ఫలితాలు కనిపిస్తున్నాయని, ముఖ్యంగా పేగుల్లో క్యాన్సర్‌, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌కు ఎండుకొబ్బరి చక్కటి మందులా పని చేస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు.

పురుషులు రోజు 38 గ్రాములు, మహిళలు రోజు 25 గ్రాములు తీసుకోవాలని, ఎండుకొబ్బరి రకరకాల వ్యాధులను దూరం చేస్తుందంటున్నారు. వ్యాధినిరోధక శక్తి పెంచుతుందని, రోజూ తింటూ ఉంటే అనారోగ్య సమస్యలు దరిచేరవంటున్నారు. అలాగే అల్సర్‌ ను కూడా ఈ ఎండుకొబ్బరి దూరం చేస్తుందని నిపుణులు వివరిస్తున్నారు.

Next Story