డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల వద్ద ఓ మహిళ వీరంగం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Sep 2019 6:56 AM GMT
డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల వద్ద ఓ మహిళ వీరంగం

హైదరాబాద్‌: చంపాపేట మినర్వా గార్డెన్ వద్ద అర్థరాత్రి ఓ మహిళ వీరంగం చేసింది.డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో తమ డ్రైవర్ మందు తాగకున్న పోలీసులు పట్టుకున్నారంటూ హడావుడి చేసింది. తమ కారును అక్రమంగా సీజ్ చేశారంటూ రోడ్‌పై హల్చల్ చేసింది. తమ కారును విడిచి పెట్టడానికి సీఐ రూ.5వేలు డిమాండ్ చేశారని పద్మ అనే మహిళ ఆరోపించింది. ఆ డబ్బులు కట్టలేమంటూ ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే..డ్రైవర్ మందు తాగాడని నిర్ధారించుకున్నాకే కేసు నమోదు చేశామని సీఐ చెబుతున్నారు. మహిళ ఆరోపించినట్లుగాతాము డబ్బులు డిమాండ్ చేయలేదని పోలీసులు చెబుతున్నారు.

మునావత్ పద్మ, శ్రీనివాస్‌లు సింగరేణి కాలనీలో నివాసముంటారు. పాపి కొండల బోటు ప్రమాదంలో మరణించిన వారి బంధువుల పరామర్శకు వెళ్లి తిరిగి వస్తున్నారు. చార్మినార్‌ దగ్గర చంపాపేట్ పోలీసులు డ్రంక్‌ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. డ్యూటీలో భాగంగా పద్మ, శ్రీను వస్తున్న కారును ఆపి చెక్‌ చేశారు. డ్రైవర్‌ మద్యం తాగాడని పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే...పద్మ మాత్రం తమ డ్రైవర్ మద్యం తాగలేదని చెప్పింది. అంతేకాకుండా ..ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ మాత్రం తాము రూ.5వేలు ఇస్తే కారు తిరిగి ఇస్తానని బేరం పెట్టారని పద్మ ఆరోపించింది. తమ వద్ద అంత డబ్బు లేదని ..కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. అయితే పద్మ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని డ్యూటీలో ఉన్న పోలీసులు చెప్పారు.డ్రైవర్ పై కేసు నమోదు చేసి కారు సీజ్ చేశామని సీఐ తెలిపారు.

Next Story