మెక్సికోలో మాఫియా రాజుకు మనిషి పుర్రెల కుర్చీ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Oct 2019 11:40 AM GMT
మెక్సికోలో మాఫియా రాజుకు మనిషి పుర్రెల కుర్చీ..!

మెక్సికో సిటీ: డ్రగ్స్‌ మాఫియాను అరికట్టే దిశగా పోలీసులు నగర వ్యాప్తంగా దాడులు నిర్వహించారు. దాడుల్లో భాగంగామెక్సికోలో డ్రగ్స్‌ మాఫియా అక్రమ వ్యాపారాలకు అడ్డగా పేరుగాంచిన టెపితో ప్రాంతంలో దాడులు చేశారు. అయితే అక్కడ ఒళ్లు గగుర్పొడిచే అనేక నమ్మలేని దృశ్యాలను చూసిన నగర పోలీసులు ఒక్కసారిగా షాక్‌ తిన్నారు. ఆ ప్రాంతంలో 40కి పైగా పుర్రెలు, డజన్ల కొద్ది ఎముకలు, వీటితో పాటు..ఓ గాజు సీసాలో ఉంచిన పిండంను పోలీసులు గుర్తించారు. అదే విధంగా నాలుగు పుర్రెలతో ఏర్పాటు చేసిన బలిపీఠాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ మేరకు వీటికి సంబంధించిన కొన్ని ఫోటోలను మెక్సికో పోలీసులు విడుదల చేశారు. కాగా.. ఈ కేసుకు సంబంధించిన 31 మందిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ కేసులో అనుమానితులుగా భావిస్తున్న 27 మందిని కోర్టు ఆదేశాల మేరకు విడుదల చేశారు. దీనికి సంబంధించిన పూర్తి విచారణ చేపడుతున్నట్లు అటర్నీ జర్నల్ ఆఫీసు అధికారిణి తెలిపారు.

కాగా.. అక్కడ గాజు సీసాలో లభ్యమైన పిండం మనిషిదా..? లేదా..జంతువులదా అన్నది ఇంకా తెలియదు అని పోలీసులు పేర్కొన్నారు. అయితే బలిపీఠంపై ఉన్న గుర్తులు, రంగు రంగుల ముద్రల ఆధారంగా ఈకేసును క్షద్రపూజల ఆధారంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇప్పటికే డ్రగ్‌ నేరగాళ్ల అడ్డాగా మారిన మెక్సికో సీటిలో ఇటువంటి సంచలన విషయాలు బయటపడటంతో.. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Next Story