గుంటూరు: జిల్లా కేంద్రంలో డ్రగ్స్ త‌యారీ కలకలం రేపింది. ఓ అపార్ట్‌మెంటులో రహస్యంగా డ్రగ్స్ త‌యారుచేస్తూ.. ఆన్‌లైన్‌లో విక్రయాలు చేస్తున్నారు. ఈ మేర‌కు నల్లపాడు పరిసర ప్రాంతంలో డ్రగ్స్ త‌యారీ కేంద్రాన్ని పోలీసులు గుర్తించారు. ప‌క్కా స‌మాచారంతో త‌న‌ బృందంతో డ్రగ్స్ త‌యారీ కేంద్రానికి చేరుకున్న‌ నల్లపాడు సిఐ వీరాస్వామి ప‌థ‌కం ప్ర‌కారం డ్రగ్స్ త‌యారీదార్ల‌ను పట్టుకున్నారు. డ్రగ్స్ తయారీకి సంబంధించి సౌదీ దేశస్తుడు షాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షాజీ ప్లాట్‌లో బొమ్మ చేతులు, గ్లౌజ్‌లు, ముఖం మాస్క్‌లు లభ్యమయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.