హైదరాబాద్ :తెలంగాణ‌ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డిపై కూకట్ పల్లి డిపోకు చెందిన కోరేటి రాజు అనే డ్రైవర్ ఫిర్యాదు చేశాడు. అశ్వత్థామ రెడ్డి వలనే ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నిన్న మీడియా సమావేశంలో మాట్లాడిన మాట‌లు నాకు క‌నువిప్పు క‌లిగించాయ‌ని కోరేటి రాజు అన్నారు. డ్రైవర్లు, కండక్టర్లు డ్యూటీల్లో జాయిన్ అయితే తమకు అభ్యంతరం లేదని.. ఇష్టమున్న వారు దరఖాస్తు పెట్టుకోవచ్చని సీఎం సూచించారని.. అందుకనుగుణంగా అందరూ విధుల్లో చేరాలని రాజు పిలుపునిచ్చారు. అయితే..ఈ రాజు అనే డ్రైవర్ ఎప్పుడూ సెలవుల్లోనే ఉంటాడంటూ సోషల్ మీడియాలో ఆయన లీవ్ ల లిస్ట్ చక్కర్లు కొడుతుంది.  వి. తిరుపతి అనే అతను రాజు లీవ్ ల లిస్ట్ ను ట్విటర్ లో పోస్ట్ చేశాడు. లీవ్ లిస్ట్ ను ట్విట్ ను మీకు కింద చూడొచ్చు. 

Image

అశ్వత్ధామ రెడ్డిపై డ్రైవర్ కోరేటి రాజు ఫిర్యాదును కింద చూడొచ్చు..

L1

L2

విధుల్లో చేరుతున్నానంటూ రాజు ఇచ్చిన పత్రం

L3

 

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.

One comment on "అశ్వత్థామ రెడ్డిపై ఫిర్యాదు చేసిన డ్రైవర్ రాజు ఎప్పుడూ సెలవుల్లోనే ఉంటాడట..!!"

Comments are closed.