డ్రోన్ కెమెరాకు పట్టుబడిన 10 మంది మందుబాబులు
By సుభాష్ Published on 30 Dec 2019 10:00 PM IST
గ్రామ శివారులో బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న పది మంది మందుబాబులను పోలీసులు పట్టుకున్నారు. కరీనంగర్ రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలోని దుర్షేడ గ్రామ శివారులో మద్యం సేవిస్తుండగా, పోలీసులు డ్రోన్ కెమెరా సహాయంతో వారిని పట్టుకున్నారు. కరీంనగర్‌కు చెందిన శ్రీకాంత్, లక్ష్మణ్, రంజిత్, బొమ్మకల్ కు చెందిన లకేష్, పెద్దపల్లికి చెందిన రాజేష్, దుర్షేడ్ చెందిన సాయి,వేణు, వంశీ, మానకొండూరుకు చెందిన రాకేష్, వికరాబాద్‌కు చెందిన సాయికిరణ్‌లను పట్టుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు.
Next Story