ఒక్క బీర్‌ తాగాడు.. 3.57 లక్షల టిప్‌ ఇచ్చాడు

By సుభాష్  Published on  2 Feb 2020 4:03 AM GMT
ఒక్క బీర్‌ తాగాడు.. 3.57 లక్షల టిప్‌ ఇచ్చాడు

రెస్టారెంట్‌కు వెళ్లిప్పుడు సర్వ్‌ చేసిన వెయిటర్‌కు టిప్‌ ఇవ్వడం సహజం. కొందరు యాబయో.. వందనో ఇస్తుంటారు.. మరి కొందరైతే వందనో, రెండు వందలో ఇస్తుంటారు.. మరి ధనవంతుడైతే ఇంకొంత ఎక్కువే ఇస్తుంటాడు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం వెయిటర్‌కు ఇచ్చిన టిప్‌ను చూస్తే షాకవుతారు. టిప్‌ ఎంతంటారా..? అక్షరాల 5 వేల డాలర్లు అంటే రూ. 3 లక్షల 57 వేలు అన్నమాట. తర్వాత అసలు విషయం తెలుకుని షాకయ్యాడు. అమెరికాలోని ఒరెగాన్‌లో పోర్‌ట్‌ల్యాండ్‌కు చెందిన దేవిడ్‌ హౌస్‌ అనే వ్యక్తి గత వారం కిందట ఆనియెల్‌ ఆర్జిజ్‌ అనే బార్‌కు వెళ్లాడు. ఒక బీర్‌ తాగి బిల్లుతో పాటు ఐదువేల డాలర్లు (3.57 లక్షలు) సర్వ్‌ చేసిన వెయిటర్‌కు టిప్‌గా ఇచ్చాడు.

ఇక్కడ ఇంకో వింతేంటంటే.. డేవిడ్‌ కేవలం ఐదు డాలర్లు మాత్రమే టిప్‌ ఇద్దామనుకున్నాడట... కానీ ఆయనకు తెలియకుండానే తన బ్యాంకు అకౌంట్ నుంచి 5వేల డాలర్లు కట్‌ అయిపోయాయి. గత నాలుగు రోజుల కిందట తన బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోగా అసలు నిజం తెలిసింది. ఖాతాలో డబ్బంతా మొత్తం ఖాళీ అయిపోయింది. షాక్‌కు గురైన డేవిడ్‌ వెంటనే బార్‌కు వెళ్లాడు. బార్‌ యజమానికి జరిగిన విషయాన్ని వివరించాడు. అయితే బార్‌ యాజమాని సైతం తన అడ్రస్‌ గురించి వెతుకుతున్నట్లు తెలుసుకున్నాడు. జరిగిన పొరపాటును గుర్తించిన బార్‌ యాజమాన్యం తన అడ్రస్‌ను వెతకడం చాలా గొప్ప విషయమని డేవిడ్‌ చెప్పుకొచ్చారు.

ఇలా మీరు కూడా ఏదైన రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు టిప్‌ ఇచ్చే ముందు కాస్త జాగ్రత్త వహించండి.. తాగిన సోయిలో ఇలా డేవిడ్‌ చేసినట్లు మీరు కూడా చేశారనుకోండి మీ ఖాతా మొత్తం ఖాళీ అయినట్లే. అమెరికాలో కాబట్టి బార్‌ యాజమాని సైతం టిప్‌ ఇచ్చిన వ్యక్తి అడ్రస్‌ కోసం వెతకడం మొదలు పెట్టాడు. మన దగ్గర అయితే కనీసం అడ్రస్‌ కూడా వెతకడు. వచ్చిందే లాభం అనుకుంటారు. అందుకే తస్మాత్‌ జాగ్రత్త.

Next Story