కేరళ: ప‌్ర‌ముఖ దంత‌వైద్యులు డాక్టర్‌ వైఎస్‌ రెడ్డికి.. డాక్టర్‌ యు.ఎస్‌.కృష్ణ నాయక్‌ పురస్కారం లభించింది. డాక్టర్‌ వైఎస్‌ రెడ్డి ప్ర‌స్తుతం ఇండియన్‌ డెంటల్‌ అసోసియేషన్‌ దక్కన్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. శుక్ర‌వారం రాత్రి కేర‌ళ రాష్ట్రం తిరువనంతపురంలో ఇండియన్‌ డెంటల్‌ అసోసియేషన్‌-2020 సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కేరళ గవర్నర్‌ అరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ చేతుల మీదుగా డాక్టర్‌ వైఎస్‌ రెడ్డి ఈ పురస్కారం అందుకున్నారు. 2019 సంవత్సరానికి గాను ఉత్త‌మ సేవ‌లు అంధించిన వారికి.. అసోసియేషన్ లోని 650కి పైగా శాఖలలోని డాక్ట‌ర్ల‌ పనితీరు ఆధారంగా ఈ అవార్డు గ్రహీతలను ఎంపిక చేశారు.

Dr. YS Reddy

ఇదిలా ఉంటే.. ఐడిఎ (ఇండియన్ డెంటల్ అసోసియేషన్) 1946లో స్థాపించబడింది. ఈ అసోసియేషన్‌లో 75,000 మందికిపైగా డెంటల్‌ డాక్టర్లు ఉన్నారు. దేశంలో ప్రజలందరి నోటి ఆరోగ్యం కోసం ఈ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది. IDA 29 రాష్ట్రాల‌లో 650కి పైగా బ్రాంచ్‌ల‌ ద్వారా వివిధ ప్రాజెక్టులు, కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దంత సంరక్షణ, పరిశుభ్రత రంగంలో కార్పొరేట్ ఏజెన్సీలతో కలిసి, నోటి ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఈ సంస్థకు ప్రభుత్వ, కార్పొరేట్‌ దంత సంస్థలు, ఎన్జీవో సంస్థలతో సంబంధాలు ఉన్నాయి.

Dr. YS Reddy

భారతదేశాన్ని ప్రపంచంలోని నోటి ఆరోగ్య సంరక్షణ గమ్యస్థానంగా మార్చడమే లక్ష్యంగా ఈ సంస్థ ప‌నిచేస్తుంది. ఈ విష‌య‌మై ఐడీఏకు ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న‌ది. ఇందులో భాగంగా రోజువారీ క్లినికల్, పరిశోధన పనుల్లో వృత్తిపరమైన నైపుణ్యాన్ని ప్రోత్సహిస్తోంది.

Dr. YS Reddy

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.