మమ్మల్ని ఇన్వాల్వ్ చెయ్యకండి ప్లీజ్

By రాణి  Published on  27 Dec 2019 7:02 AM GMT
మమ్మల్ని ఇన్వాల్వ్ చెయ్యకండి ప్లీజ్

జమ్ము కశ్మీర్‌ సమస్యపై తాము స్పందించేది లేదని రష్యా మరోసారి తేల్చి చెప్పింది. ఆ సమస్యని భారత్, పాక్ ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, అంతేకానీ ఆ అంశాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రస్తావించే ఆసక్తి తమకి లేదని రష్యా స్పష్టం చేసింది. ఈ మేరకు రష్యా డిప్యూటీ అంబాసిడర్ రోమన్ బాబుష్కిన్‌ ఒక ప్రకటన చేశారు.సిమ్లా, లాహోర్‌ ఒప్పందం ప్రకారం, భారత్, రష్యా మధ్య ఏ అంశానైనా ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. దీనిపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలితో సహా, ఇతర అంతర్జాతీయ వేదికలపై మాట్లాడాలని అనుకోవట్లేదు’’ అని అన్నారు.

కశ్మీర్‌ అంశంపై చర్చించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశం కావాలని చైనా కోరిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పలుమార్లు ఈ అంశంపై చైనా చేస్తున్న ప్రయత్నాలను అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్, రష్యా అడ్డుకున్నాయి. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం ఆగస్టులో రద్దు చేసింది. కానీ, పొరుగు దేశాలైన పాకిస్థాన్‌, చైనా అంతర్జాతీయ వేదికలపై ఈ విషయాన్ని లేవనెత్తుతూనే ఉన్నాయి. రష్యా ప్రకటనతో ఆ రెండు దేశాలకు గట్టి దెబ్బ తగిలినట్టయ్యింది. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత ఆగస్టులో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కశ్మీర్‌ అంశంపై చర్చించేందుకు దశాబ్ద కాలం తర్వాత సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.

Next Story