రవిప్రకాశ్ సిలికాన్ ఆంధ్ర సంజీవిని ఆసుపత్రి పై దాతలు ఆగ్రహం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Oct 2019 11:15 AM GMT
రవిప్రకాశ్ సిలికాన్ ఆంధ్ర సంజీవిని ఆసుపత్రి పై దాతలు ఆగ్రహం

కూచిపూడి: రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజివినీ ఆస్పత్రి కమిటీ సమావేశం రేపు జరగనుంది. ఇటీవల ఆస్పత్రిపై వచ్చిన ఆరోపణలపై దాతలు ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. అంతేకాదు..వివరణ కోరడానికి కూడా సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే... సిలికాన్ ఆంధ్ర ఛైర్మన్ కూచిభట్ల ఆనంద్ కూచిపూడి చేరుకున్నారు. రేపు చర్చించాల్సిన అంశాలపై ఆసుపత్రి జి.ఎం. వర్మతో రహస్యంగా కూచిభట్ల ఆనంద్ సమావేశం అయినట్లు తెలుస్తోంది. పామర్రు ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఆసుపత్రి సందర్శించారు. ప్రస్తుత పరిణామాలపై జి.ఎం.ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యే అనిల్ ని సముదాయించడానికి ఆనంద్ వర్గీయులు ప్రయత్నించినట్లు సమాచారం.

అయితే..రేపు జరిగే సమావేశాన్ని అత్యంత రహస్యంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సమావేశం గురించి దాతలకు మాత్రమే తెలిపారు. కూచిపూడి ఆనంద్‌ను నిలదీయడానికి కూచిపూడి అగ్రహారం పెద్దలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆస్పత్రి ప్రారంభించి ఏడాది అయినా..సరైన వైద్యం అందలేదని 150 గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. రేపటి సమావేశంపై మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Next Story
Share it