ట్రంప్‌ సంచలన నిర్ణయం

By సుభాష్  Published on  15 April 2020 5:06 AM GMT
ట్రంప్‌ సంచలన నిర్ణయం

డబ్ల్యూహెచ్‌వోకు నిధులను నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారు. నిధులను వెచ్చించడంలో పారదర్శకత్వాన్ని పక్కనబెట్టి వర్డల్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ కొన్ని దేశాలకు పక్షపాతిగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, డబ్ల్యూహెచ్‌ఓకు అమెరికా నుంచి అందుతున్న నిధులను నిలిపివేస్తున్నట్లు ట్రంప్‌ స్పష్టం చేశారు.

మిగులు నిధులను ఎలా సద్వినియోగం చేసుకోవాలన్న విషయంలో నిర్ణయిస్తామన్నారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశాలను ఆదుకోవాలని డబ్ల్యూహెచ్‌ఓ భావించడం లేదని ట్రంప్‌ ఆరోపించారు.

అలాగే కరోనా వైరస్‌ వ్యాప్తిపై ప్రపంచానికి సరైన సమయంలో సమాచారాన్ని చేరవేయడం లేదని విమర్శించారు. చైనా నుంచి వచ్చిన సమాచారాన్ని వచ్చినట్లుగా చెబుతుందే తప్ప, అందులో ఏ మాత్రం వాస్తవ పరిస్థితులను వరల్డ్‌హెల్త్‌ ఆర్గనైజేషన్‌ అంచనా వేయడం లేదని మండిపడ్డారు. వారిచ్చిన తప్పుడు సమాచారం వల్లనే ప్రపంచ వ్యాప్తంగా 20 రేట్లు పెరిగిందని మండిపడ్డారు.

ఇకపై ఆ సంస్థకు తమ నిధులు అందబోవని ట్రంప్‌ స్పష్టం చేశారు. కాగా, గత ఏడాది డబ్ల్యూహెచ్‌వోకు అమెరికా నుంచి 400 మిలియన్‌ డాలర్ల నిధులు అందించింది. ఇక అమెరికా తీసుకున్న నిర్ణయంపై ఐక్యరాజ్యసమితి చీఫ్‌ ఆంటోనియా గుటెరస్‌ స్పందించారు. ఆర్థిక వనరులను తగ్గించడానికి ఇది సరైన సమయం కాదని అభిప్రాయపడ్డారు. ఒక వైపు కరోనాపై ప్రపంచం పోరాడుతోందని, ఇందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరం ఉంటుందని అన్నారు.

Next Story