మోదీని అన్ ఫాలో చేసిన ట్రంప్, వైట్ హౌస్

By రాణి  Published on  29 April 2020 3:40 PM GMT
మోదీని అన్ ఫాలో చేసిన ట్రంప్, వైట్ హౌస్

అమెరికా అధ్యక్షుడు, ప్రపంచ పెద్దన్న డొనాల్డ్ ట్రంప్ ఇండియా లో పర్యటించి, భారత్ - అమెరికా మధ్య సత్సంబంధాలను బలపరుస్తామని మోదీకి చెప్పి రెండు నెలలైనా అయిందో లేదో అప్పుడే రెండు దేశాల మధ్య బంధం పరోక్షంగా దెబ్బతింటోంది. ఇందుకు అద్దం పట్టేలా ట్రంప్ మోదీని ట్విట్టర్ లో అన్ ఫాలో చేశారు. వైట్ హౌస్ అధికారిక ఖాతాతో పాటు మనదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం, ప్రధానమంత్రి కార్యాలయం, రాష్ట్రపతి ఇలా మొత్తం 19 ఖాతాలను ట్రంప్ అన్ ఫాలో చేశారు. ఇటీవలే మోదీని ఫాలో చేయడం ప్రారంభించిన ట్రంప్..ఉన్నట్లుండి అన్ ఫాలో చేయడంపై పలు అనుమానాలొస్తున్నాయి.

Also Read : వేసవి సెలవులు రద్దు.. తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు చేసిన ఈ చర్యతో భారత్ - అమెరికా సత్సంబంధాలపై చర్చకు తెరలేపినట్లయింది. అమెరికా తమకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ కావాలని అడుగగా పంపిస్తామని చెప్పింది భారత్. అయినా ట్రంప్ ఈ రకమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నట్లో ? అని గుసగుసలు వినపడుతున్నాయి. ఒకవేళ భారత్ అమెరికాల మధ్య బంధం బలహీన పడితే మాత్రం ఇక్కడి నుంచి అమెరికా వెళ్లాలనుకునేవారికి మాత్రం చుక్కలు కనిపిస్తాయి.

Also Read :ఇర్ఫాన్ మృతి పట్ల ప్రముఖుల సంతాపం

Next Story