కుక్క‌ను వెత‌కండి.. మ‌హా ప్ర‌భో..

By Newsmeter.Network  Published on  12 Jan 2020 10:27 AM GMT
కుక్క‌ను వెత‌కండి.. మ‌హా ప్ర‌భో..

హైద‌రాబాద్ : దొంగతనం అంటే ఏ బంగారమో, నగదో పట్టుకెళ్లే దొంగ‌ల‌ను చూశాం కానీ.. ఈ దొంగ మాత్రం వైర‌టీగా కుక్క‌ను ఎత్తుకెళ్లాడు. కుక్క అంటే మామూలు కుక్క కాదండోయ్ మెరీడియ‌న్ జాతి కుక్క. త‌ను పెంచుకుంటున్న కుక్క‌ను ఎత్తుకెళ్లాడంటూ ఓ వ్య‌క్తి ఆదివారం ఎస్ఆర్ న‌గ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.

ఎల్లారెడ్డి గూడ‌లో నివాసం ఉంటున్న సాయి కృష్ణ మెరీడియ‌న్ జాతికి చెందిన ఓ కుక్క ను పెంచుకుంటున్నాడు. కాగా కుక్క ఇంటి ముందు ఆడుకుంటుండ‌గా గుర్తు తెలియ‌ని దుండ‌గులు ఎత్తుకెళ్లార‌ని సాయి కృష్ణ ఎస్ఆర్ న‌గ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. గత కొంతకాలంగా ఎల్లారెడ్డిగూడ ప్రాంతంలో పెంపుడు కుక్కలు, మేకలను కొందరు గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Next Story