ఐ లవ్ మై డాగ్..!
By సత్య ప్రియ Published on 23 Oct 2019 7:02 AM GMTఅందరూ పెంపుడు జంతువులను ప్రేమిస్తారు... అందులో కుక్కలంటే ఎవరికి ఇష్టం వుండదు.
ఒంటరితనంలో కుక్క పిల్లలతో స్నేహం ఎంతో సేద తీరుస్తుంది. వాటితో ఆడుకోవచ్చు, ఆనందంగా గడపవచ్చు. మన రోజు వారీ కష్టాలూ, ఆందోళనలూ కుక్కపిల్లలతో ఆడుకుంటుంటే ఇట్టే మర్చిపోవచ్చు. అవి మన కుటుంబంలో ఒక భాగం అయిపోతాయి.
మరి అలాంటి కుక్క పిల్ల కి మనం తినే ఆహారం పెట్టాలనీ, పుట్టిన రోజులు చేయాలనీ, ఆనందంగా దానికి నచ్చింది తినిపించాలనీ అనిపిచడంలో తప్పు లేదు కదా...
కానీ అది ఎలా సాధ్యం?? మనం తినే ఆహారం లాంటిది కుక్కలకు పెడితే వాటి వంటికి మంచిది కాదు కదా..? అంటారా
అయితే, ఇది చూడండి...
డాగ్ బేకరీ... కుక్కల కోసం ప్రత్యేకంగా తెరవబడిన తినుబండారాల దుకాణం. ఇక్కడ కుక్కల కోసం ప్రత్యేకమైన వంటకాలను తయారు చేస్తారు, అవి తినే వీలుగా బర్గర్లూ, వాటి పుట్టినరోజులైతే ప్రత్యేకంగా వాటి కోసం కేకులూ... రుచికరమైన తీపి పదర్ధాలూ... ఇలా మరెన్నో...
ఇవన్నీ రుచికరమైనవే కాదు... కుక్కలు తినే వాటితోనే తయారు చేయబడి ఉండడం వల్ల వాటి ఆరోగ్యానికి మంచివి కూడా.. అంతే కాదు, కుక్కల కోసం ఎన్నో ప్రత్యకమైన వస్తువులు https://www.thedogbakery.com/ అనే వారి వెబ్ సైట్ లో దొరుకుతాయి.
బాగుంది కదూ ఈ వినూత్న ప్రయోగం...