కర్నూల్ లో తొలి కరోనా పేషెంట్ డిశ్చార్జ్..అత్యవసర సేవలు బంద్
By రాణి Published on 14 April 2020 2:59 PM GMTకర్నూల్ జిల్లాలో తొలిసారి కరోనా పాజిటివ్ పేషెంట్ ను వైద్యులు మంగళవారం డిశ్చార్జ్ చేశారు. రాజస్థాన్ కు చెందిన యువకుడికి కరోనా నెగిటివ్ రావడంతో..అతడు పూర్తిగా కోలుకున్నాడని నిర్థారించాక వైద్యులు అతడిని డిశ్చార్జ్ చేశారు. సదరు యువకుడు జిల్లాలోని నోస్సం రైల్వే స్టేషన్ లో గ్యాంగ్ మెన్ గా పనిచేసేవాడు. జిల్లా వ్యాప్తంగా నమోదైన తొలి కరోనా కేసు ఇదే. కరోనా వచ్చినప్పటి నుంచి బాధితుడికి ఐసోలేషన్ లో చికిత్స అందించారు వైద్యులు. డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది సేవలతో బాధితుడు కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా..జిల్లా కలెక్టర్ జి. వీర పాండియన్ యువకుడిని పలుకరించి, యోగక్షేమాలడిగి తెలుసుకున్నారు.
Also Read : చదువుకున్న ఆడపిల్లవి..నువ్విలా చేయడం న్యాయమా ? పోలీస్ ప్రశ్న
ఇదిలా ఉండగా కర్నూల్ జిల్లాలో కరోనా లక్షణాలతో ప్రైవేట్ డాక్టర్ మృతి చెందడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. డాక్టర్ మృతితో అత్యవసర సేవలను కూడా బంద్ చేసింది. మెడికల్ షాపులు, ఇతర నిత్యాసరాలు లభించే దుకాణాలన్నింటినీ మూసివేయిస్తున్నారు. ఇకపై అత్యవసరమైనా బయటికి రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి అవసరమున్నా వాలంటీర్లు, పోలీసుల ద్వారానే ఇళ్లకు నిత్యావసరాలను చేరవేస్తామని పేర్కొన్నారు.
Also Read : మీ జన్ ధన్ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదా తెలియట్లేదా ? ఇలా చెక్ చేసుకోండి