సినీ హీరో రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌కు ఉన్న క్రేజే వేరు. ముఖ్యంగా యువత ప్రభాస్‌ అంటే వెర్రెత్తిపోతారు. ఇటీవల ప్రభాస్‌ షూటింగ్‌ కోసం యూరప్‌తో పాటు మరికొన్ని దేశాల్లో పర్యటించారు. ఈ మధ్యే ప్రభాస్‌ షూటింగ్‌లు ముగించుకొని అక్కడి నుండి ఇండియాకు తిరిగొచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్‌ భారిన పడి వేలాది మంది మృత్యువాతపడుతున్నారు. మరీ ముఖ్యంగా ఇతర దేశాల్లో ఈ వైరస్‌ తీవ్ర ఎక్కువగా ఉంది.

Also Read :కరోనా ఎఫెక్ట్.. లాక్‌డౌన్ దిశగా అన్ని రాష్ట్రాలు

భారత్‌లోనూ ఈ వైరస్‌ భారిన పడి ఏడుగురు మృతి చెందగా.. మరో 396 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్‌ విదేశాల నుంచి వచ్చేవారి వల్లే ఎక్కువ సోకుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మార్చి 1 నుంచి విదేశాల నుంచి వచ్చిన వారంతా.. కచ్చితంగా సెల్ఫ్‌ క్వారెంటైన్‌ చేసుకోవాలని అధికారులతో పాటు ప్రభుత్వం కూడా హెచ్చరించింది. దాంతో ప్రస్తుతం ప్రభాస్‌ తనను తాను సెల్ఫ్‌ క్వారెంటైన్‌ చేసుకున్నాడు.

విదేశాల నుంచి రాగానే అధికారులకు సమాచారం ఇచ్చి నేరుగా సెల్ఫ్‌ క్వారెంటైన్‌కు వెళ్లారంట. ఈ విషయాన్ని ప్రభాస్‌ పెద్దనాన్న, బీజేపీ నేత కృష్ణం రాజు మీడియాకు తెలిపారు. ప్రభాస్‌తోపాటు తన పెద్ద కూతురు సాయి ప్రసీద సైతం సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్నారని తెలిపారు. ప్రసీద అమెరికా నుంచి ఇటీవలే వచ్చింది. దీంతో ఆమెసైతం అధికారులకు సమాచారమిచ్చి సెల్ఫ్‌ క్వారంటైన్‌ లోకి వెళ్లినట్లు కృష్ణంరాజు తెలిపారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.