పావురాలకు మేత వేయొద్దు..!: జీహెచ్‌ఎంసీ అధికారులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Oct 2019 5:56 AM GMT
పావురాలకు మేత వేయొద్దు..!: జీహెచ్‌ఎంసీ అధికారులు

నుషుల్లో శ్వాస సంబంధిత వ్యాధులకు పావురాలు కారణం అవుతున్నాయా?.. వాటి రెట్టలతో చారిత్రక కట్టడాలు వాటి శోభను కొల్పోతున్నాయా?..అంటే నిజమే అంటున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ అధికారులు. రోజు రోజుకు పెరుగుతున్న పావురాల సంఖ్యతో.. ప్రజల ఆరోగ్యానికి సమస్యగా మారిందని జీహెచ్‌ ఎంసీ అధికారులు చెబుతున్నారు. వాటి రెట్టలతో వాతావరణ కాలుష్యం ఏర్పడుతోందన్నారు. దీని ద్వారా నగర వాసులు అనారోగ్యం పాలవుతున్నారని చెబుతున్నారు.

పావురాల స్థావరాలీవే:

పావురాలు ఎక్కువగా బహుళ అంతస్తుల భవనాల్లో స్థావారాలను ఏర్పాటు చేసుకొని నివస్తున్నాయి. తద్వారా వాటి సంఖ్య విపరీతంగా పెరుగుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా పలు మార్కెట్లు, దుకాణాలు ముఖ్యంగా పావురాలకు వేసే ఆహార పదార్థాల అమ్మకాలను నిలిపి వేయాలని...ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు శనివారం మీడియా ప్రకటన విడుదల చేశారు.

Pigeons 4

నివారణ చర్యలు:

కాగా.. నగరంలో ఉన్న హార్టీ కల్చర్‌ పార్కుల్లో పావురాలకు ఆహారాన్ని వేయటాన్నిజీహెచ్ ఎంసీ అధికారులు నిషేధించారు. దీనిలో భాగంగా మరోవైపు మొజాంజాహి మార్కెట్లో పావురాలకు దాణాగా వేస్తున్న మొక్క జోన్న, ఇతర తృణధాన్యాలను స్వాధీనం చేసుకున్నారు. పావురాల రెట్టలతో..మొజాంజాహి మార్కెట్లోని చారిత్రాత్మక కట్టాడాలు పాడవుతున్నాయి. దీంతో మొజాంజాహి మార్కెట్‌లోని దాదాపు 500 పావురాలను పట్టి..వాటిని శ్రీశైలం అడవుల్లో విడిచిపెట్టారు.

Hyd Bird

Next Story