పీకేకు డీఎంకే వ్యూహాల బాధ్యత..

By అంజి  Published on  3 Feb 2020 4:26 AM GMT
పీకేకు డీఎంకే వ్యూహాల బాధ్యత..

చెన్నై: బీహార్‌కు చెందిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఇప్పటికే ఏపీలో వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన పీకే.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తనదైన మార్క్‌ను చూపించబోతున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫున పీకే ఎన్నికల వ్యూహాలను రచిస్తున్నారు. ఇదిలా ఉంటే త్వరలో తమిళనాడులో ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో డీఎంకే వ్యూహాలు రూపొందించే బాధ్యతలను ప్రశాంత్‌ కిషోర్‌కు అప్పగించినట్టు ఆ పార్టీ అధినేత స్టాలిన్‌ తెలిపారు. గతంలో పీకే బీజేపీ నేతలకు సైతం వ్యూహకర్త పనిచేశారు. 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల జరగనున్నాయి. తమ పార్టీ వ్యూహాకర్తగా పీకే సంస్థ ఐప్యాక్‌ పనిచేస్తుందని స్టాలిన్‌ పేర్కొన్నారు. ప్రత్యర్థులను చిత్తు చేసేలా వ్యూహాలను రూపొందించాలని డీఎంకే భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాదికి చెందిన పీకేను దక్షిణాదికి రప్పిస్తున్నారు.

2021లో తమకు కలిసి పని చేయడానికి, తమిళనాడుకు పూర్వ వైభవం తీసుకువచ్చేలా చాలా మంది ఐప్యాక్‌ మేధావులు పనిచేస్తారని డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌ ట్వీట్‌ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించడానికి తమ ఐప్యాక్‌ బృందం పనిచేస్తుందని, డీఎంకేతో కలిసి పని చేసేందుకు ఉత్సుకతో ఉన్నామని పీకే తెలిపారు. కాగా గత 10 ఏళ్ల నుంచి డీఎంకే ప్రతిపక్షంగా ఉంటు వస్తోంది. ఈసారి ఎలాగైన అన్నాడీఎంకేను గద్దె దింపాలని డీఎంకే భావిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ, వెస్ట్‌బెంగాల్‌లో టీఎంసీ కోసం పీకే ఐప్యాక్‌ పని చేస్తోంది. గత సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే పార్టీ 38 సీట్లను గెల్చుకుంది.

Next Story