కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక..5శాతం కరువు భత్యం

ఢిల్లీ: దీపావళి రాకముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లలో కేంద్రం కాంతులు నింపింది. ఉదయం జరిగిన కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి కానుకగా 5శాతం కరువు భత్యం పెంచుతున్నట్లు ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. దీంతో కరువు భత్యం 17శాతానికి చేరుకుంటుందన్నారు. రూ.16వేల కోట్ల భారం పడుతున్నప్పటికీ కేంద్రం నిర్ణయం తీసుకుందని చెప్పారు. దీని వలన 60లక్షల మంది ఉద్యోగులు హ్యాపీగా ఉంటారని కేంద్రం ప్రకటించింది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్