జనగామ: రైతులకు అన్ని విధాల అండగా ఉంటున్నామని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. జనగామలో జరిగిన వరిధాన్యం, పత్తి కొనుగోళ్లపై అవగాహన సదస్సులో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. పంటను మార్కెట్‌లో అమ్ముకునే ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రైతు సమన్వయ సమితి వ్యవహరించాలని ఎర్రబెల్లి అన్నారు. పంటలు కొనుగోలు చేసిన వెంటనే గడువు లోపల చెల్లింపు చేయాలని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. పంట తడవకుండా మార్కెట్‌లో టార్పాలిన్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

జనగామ జిల్లాలో ఈ సారి రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి అయిందన్నారు. గ్రామాల్లో చేపట్టిన 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం విజయవంతం అయిందన్నారు. అవగహన సదస్సులో జెడ్పీ చైర్మన్‌ సంపత్‌రెడ్డి, వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు అధికారులు పాల్గొన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.