‘దిశ ఎన్ కౌంటర్’ ట్రైలర్ రీలిజ్‌ డేట్‌ ఫిక్స్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Sep 2020 7:19 AM GMT
‘దిశ ఎన్ కౌంటర్’ ట్రైలర్ రీలిజ్‌ డేట్‌ ఫిక్స్‌

గతేడాది హైదరాబాద్‌ నగర శివారులో జరిగిన దిశ హత్య కేసు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దిశను అత్యంత పాశవికంగా హత్య చేసిన నిందితులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైయ్యారు. వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.. ఈ ఘటనను ఆధారంగా చేసుకుని దిశ ఎన్‌కౌంటర్‌ అనే చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.ఆనంద్‌ చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

ఇప్పటికే ఈ సినిమాకు ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేసిన వర్మ.. తాజాగా మరొక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్ర ట్రైలర్‌ రేపు విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. రేపు ఉదయం 9 గంటల 08 నిమిషాలకు ట్రైలర్‌ విడుదల చేయబోతున్నట్లు రాంగోపాల్‌ వర్మ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించాడు. కాగా.. ఈ చిత్రాన్ని దిశ ఘటన జరిగిన నవంబర్‌ 26నే సినిమా విడుదల చేస్తామని వర్మ తెలిపాడు.Next Story