దిశ సంగతి సరే... ఈ రేప్ ను ఎవరూ పట్టించుకోరా?

By అంజి  Published on  8 Dec 2019 8:25 AM GMT
దిశ సంగతి సరే... ఈ రేప్ ను ఎవరూ పట్టించుకోరా?

దిశ రేప్ జరిగిన దానికి మూడురోజుల ముందే ఈ రేప్ కూడా జరిగింది. అందులో బాధిత మహిళను రేప్ చేసి చంపేశారు. ఈ సంఘటనలోనూ మహిళను రేప్ చేసి చంపేశారు. అందులో నలుగురు నిందితులు. ఈ సంఘటనలో ముగ్గురు నిందితులు. కానీ తేడా ఒక్కటే. దిశ సంఘటనలో ప్రజలందరూ ఉవ్వెత్తున లేచారు. ఉద్యమాలు చేశారు. పోలీస్ స్టేషన్ ను ఘెరావ్ చేశారు. ఫలితంగా షాద్ నగర్ లో సజ్జనార్ నాయకత్వంలో పోలీసులు నిందితులను కాల్చి చంపేశారు. దిశ అగ్రవర్ణానికి చెందిన మహిళ.. ఆమెది హైదరాబాద్ కు చేరువలో ఉన్న షాద్ నగర్. రెండో మహిళ బుడగజంగాలకు చెందిన దళిత మహిళ. ఆమెది రాజధానికి సుదూరంలో గిరిజన ప్రాంతంలో ఉన్న ఎల్లపటార్.

ఈ సంఘటనలోనూ నలుగురు నిందితులను అరెస్టైతే చేశారు. ఆ తరువాత అంతా ప్రశాంతం. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్ మండలంలో యెల్లపటార్ లో ఈ ఘాతుకం జరిగింది. నిందితులు షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ మక్దూమ్ లు అరెస్టయ్యారు. కానీ దిశ సంఘటన తరువాత పోలీసులు వీరిని ఎన్ కౌంటర్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మండల కేంద్రం జైనూర్, లింగాపూర్ మండలకేంద్రాలలో ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. అగ్రవర్ణ మహిళకు ఒక న్యాయం, దళిత మహిళకు ఒక న్యాయం ఏమిటని వారు ప్రశ్నిస్తుననారు. ఒక్క సారి మాకు వదిలి చూడండి. నిందితులకు తగిన శిక్ష వేసి చూపిస్తాం అని వారు హుంకరిస్తున్నారు. జైనూర్ శనివారం పూర్తిగా బంద్ పాటించింది. ప్రజలు ఉట్నూర్ ఆసిఫాబాద్ రోడ్డును నమూసివేశారు. చివరికి మధ్యహ్నం పోలీసులు జోక్యం చేసుకుని హామీ ఇచ్చే దాకా రాస్తారోకోను విరమించలేదు. దర్యాప్తును వేగవంతం చేస్తామని వారు ప్రజలకు హామీ ఇచ్చారు.

మహిళను రేప్ చేసిన వారు ముగ్గురూ ఒకే మతానికి చెందిన వారు. ముగ్గురూ కలప స్మగ్నర్లు. ఈ సంఘటన జరిగిన తరువాత జైనూర్ లో ఉన్న బుడిగ జంగం కుటుంబాలు తమ తమ సొంత ఊళ్లకు వెళ్లిపోయాయి. పైగా బాధిత కుటుంబానికి సాయం చేసేందుకు జమాతె ఇస్లామీ ముందుకు వచ్చింది. మొత్తం మీద ఈ సంఘటన వెనుక వేరే కథ ఏదో ఉందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

Next Story