సినీ న‌టి అమలాపాల్ మాజీ భర్త, త‌మిళ దర్శకుడు విజయ్ తండ్రి అయ్యాడు. ఈ మేరకు ఆయన అన్న నటుడు ఉదయ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేశాడు. విజయ్, ఐశ్వర్య దంపతులకు ఉదయం 11.25 గంటలకు మగ బిడ్డ పుట్టాడని.. తాను పెదనాన్నను అయ్యానని ఉదయ ట్వీట్ చేశాడు. తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని చెప్పాడు.

విజ‌య్‌, అమ‌లాపాల్ ఇద్ద‌రూ ప్రేమించుకుని 2014లో పెళ్లిచేసుకున్నారు. కొద్ది రోజుల్లోనే వీరి వైవాహిక బంధంలో విభేదాలు త‌లెత్తాయి. 2017లో ఇద్ద‌రు అధికారికంగా విడాకులు తీసుకున్నారు. అమలా పాల్ సినిమాల్లో నటించే విషయమై వారి మధ్య విభేదాలు తలెత్తి అదే వారి మధ్య విడాకులకి దారి తీసిందని వార్తలు వినిపించాయి. ఆ మధ్య విజయ్ తండ్రి చేసిన వ్యాఖ్యలు ఎంతగానో వైరల్ అయ్యాయి. విజయ్, అమలాపాల్ విడిపోవడానికి హీరో ధనుష్ కారణమని చెప్పడం, ఆ ఆరోపణలను అమలాపాల్ ఖండించడం ఇలా ఒకరిపై ఒకరు ఆరోప‌ణ‌లు చేసుకున్నారు.

పెద్దల ఒత్తిడి మేర‌కు విజయ్ డాక్టర్ ఐశ్వర్య ను పెళ్లిచేసుకోగా.. విడాకుల త‌రువాత అమలాపాల్ హీరోయిన్ గా మళ్ళీ సినిమాలు మొదలుపెట్టింది. ఇక ప్రస్తుతం విజయ్ కంగనా హీరోయిన్‌గా ‘తలైవి’ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో అమ‌లాపాల్ మాట్లాడుతూ.. తాను కూడా త్వ‌ర‌లోనే మ‌రో పెళ్లిచేసుకోనున్న‌ట్లు తెలిపింది. త‌న మ‌న‌సును పూర్తిగా తెలుసుకున్న ఒక‌రితో ప్రేమ‌లో ఉన్నాన‌ని అయితే అత‌డి పేరును వెల్ల‌డించేందుకు మాత్రం ఇష్ట‌ప‌డ‌లేదు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.