సైరా సినిమాతో అటు ఆడియ‌న్స్‌లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను మంచి గుర్తింపు సంపాదించుకున్నటాలెంటెడ్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి. సైరా సినిమా త‌ర్వాత‌ సురేంద‌ర్ రెడ్డి ఎవ‌రితో సినిమా చేయ‌నున్నాడు అనేది ఆస‌క్తిగా మారింది. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌.. సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ సినిమాలు ప్లాన్ చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే... ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణతో చేస్తోన్న సినిమాతో బిజీగా ఉన్నాడు.

ఇక మ‌హేష్ బాబు 'స‌రిలేరు నీకెవ్వ‌రు' సినిమా చేస్తున్నాడు. త‌దుప‌రి చిత్రం పై ఇంకా ఏ నిర్ణ‌యం తీసుకోలేదు. ప్ర‌భాస్ వ‌చ్చే సంవ‌త్స‌రం డేట్స్ కానీ ఇవ్వ‌క‌పోతే... ఈలోపు నిర్మాణ రంగంలోకి ప్రవేశించి చిన్న సినిమాలు నిర్మించాలని సురేంద‌ర్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిన్న సినిమాల‌కు క‌థ‌ల‌ను సురేంద‌ర్ రెడ్డే అందించనున్నట్లు తెలుస్తోంది‌. ఇక ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను త‌న శిష్యుల‌కు అందిస్తాడ‌ని స‌మాచారం.

యువ హీరో వ‌రుణ్ తేజ్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. దీనికి క‌థ సురేంద‌ర్ రెడ్డి రెడీ కథను పూర్తి చేశారు. కాగా.. ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను త‌న శిష్యుల్లో ఎవ‌రికి ఇస్తాడ‌నేది త్వ‌ర‌లో ఎనౌన్స్ చేయనున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ స్టార్ట్ చేసిన‌ట్టు స‌మాచారం. మ‌రి... ద‌ర్శ‌కుడిగా విజ‌యం సాధించిన సురేంద‌ర్ రెడ్డి నిర్మాత‌గా కూడా రాణిస్తాడ‌ని ఆశిద్దాం.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story