ప్రభాస్ ఓకే అంటేనే సురేందర్ రెడ్డికి ఛాన్స్

By రాణి
Published on : 14 Dec 2019 10:51 AM IST

ప్రభాస్ ఓకే అంటేనే సురేందర్ రెడ్డికి ఛాన్స్

షార్ప్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవితో పాన్ ఇండియా లెవల్లో సైరాను తీసి టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరాడు. సైరాకి ముందు సురేందర్ రెడ్డికి మంచి గుర్తింపే ఉన్నా.. సైరా తరువాత ఆయన రేంజ్ మారింది. ముఖ్యంగా సైరా తెలుగులో నాన్ బాహుబలి రికార్డ్స్ ను బ్రేక్ చేయడం, సైరాలో చాల సీన్స్ ను కేవలం తన టేకింగ్ తోనే సురేంధర్ రెడ్డి ఆకట్టుకోవడంతో..ఆయన తర్వాత చిత్రాన్ని ఏ హీరోతో చేయబోతున్నాడనే విషయం పై ఇప్పటికే అనేక ఊహాగానాలు వస్తున్నాయి. తర్వాత చిత్రం కోసం సురేందర్ రెడ్డి స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నాడు కానీ వెంటనే సినిమా తెరకెక్కించేందుకు స్టార్ హీరోలెవరూ ఖాళీగా లేరు. స్టార్ హీరోతోనే సినిమా చేయాలంటే సురేందర్ కొంత కాలం ఆగాల్సిందే. మహేష్ బాబు, అల్లు అర్జున్ కొద్దిరోజులలో తమ సంక్రాంతి కానుకగా విడుదలయ్యే ''సరిలేరు నీకెవ్వరు'', ''అలవైకుంఠ పురంలో'' చిత్రాల షూటింగ్ పార్ట్ ను పూర్తి చేయనున్నారు.

అల్లు అర్జున్ ఆల్ రెడీ సుకుమార్ తో కమిటైపోగా, మహేష్ బాబు మరోసారి వంశీ పైడిపల్లితోనే సినిమా చేయనున్నట్లు సమాచారం. ఇక ఎన్టీఆర్, చరణ్ లు అయితే రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ నుండి బయటపడటానికి ఇంకా చాలా సమయం పడుతుంది. చివరికి కిక్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన రవితేజ కూడా గోపీచంద్ మలినేనితో సినిమాని మొదలుపెట్టాడు. మొత్తానికి ప్రభాస్ ఓకే అంటే సురేంద్ర రెడ్డికి త్వరగా సినిమాని మొదలుపెట్టే ఛాన్స్ ఉంటుంది. సురేంద్ర రెడ్డి కూడా అదే ఫీల్ అవుతున్నాడట. ప్రస్తుతం ప్రభాస్ చేస్తోన్న జాన్ సినిమా ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తయింది. ఎటూ ఇక పై ప్రభాస్ స్పీడ్ గా సినిమాలు చేయాలనుకుంటున్నాడు కాబట్టి సురేందర్ రెడ్డి కథ కనుక ప్రభాస్ కి నచ్చితే వెంటనే ఓకే చెప్పే అవకాశం ఉంది. అందుకే సురేందర్ రెడ్డి కూడా కథతో ప్రభాస్ ని మెప్పించే దిశగా స్క్రిప్ట్ పై కసరత్తులు చేస్తున్నాడట.

Next Story