ఎట్ట‌కేల‌కు కందిరీగ డైరెక్ట‌ర్ సినిమా స్టార్ట్ అయ్యింది

By Newsmeter.Network  Published on  29 Nov 2019 11:09 AM GMT
 ఎట్ట‌కేల‌కు కందిరీగ డైరెక్ట‌ర్ సినిమా స్టార్ట్ అయ్యింది

కందిరీగ సినిమాతో విజ‌యం సాధించి.. ప‌రిశ్ర‌మ దృష్టిని ఆక‌ర్షించిన యువ ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీనివాస్. ఆత‌ర్వాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో ర‌భ‌స, ఎన‌ర్జిటిక్ హీరో రామ్ తో హైప‌ర్ సినిమా తీసినా స‌క్స‌స్ మాత్రం రాలేదు. ఆత‌ర్వాత గ‌త కొంత కాలంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో సినిమా తీయాల‌ని ప్ర‌య‌త్నించారు కానీ.. ఫ‌లితం ద‌క్క‌లేదు.

ఇలా.. చాలా ప్ర‌య‌త్నాలు చేసిన సంతోష్ శ్రీనివాస్ ఆఖ‌రికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నారు. ఈ మూవీ ఈరోజు రామానాయుడు స్టూడియోలో ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ క్లాప్ కొట్ట‌గా నిర్మాత జెమిని కిర‌ణ్ కెమెరా స్విచాన్ చేశారు. ప్ర‌ముఖ నిర్మాత‌ దిల్ రాజు గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ల‌వ్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ సినిమా రూపొంద‌బోతోంది. డిసెంబ‌ర్ 6 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించి హైదరాబాద్, దుబాయ్, అబ్రాడ్ లో చిత్రీక‌రణ జ‌ర‌ప‌బోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. వ‌చ్చే ఏడాది వేస‌విలో విడుద‌ల‌కు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. యాక్టింగ్ కు మంచి స్కోప్ ఉన్న పాత్రలో సాయిశ్రీనివాస్ క‌నిపిస్తాడు. త‌న కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుందని డైరెక్ట‌ర్ సంతోష్ శ్రీనివాస్ చెప్పారు.

Next Story
Share it