విషాదం.. సంచలన దర్శకుడు గుండెపోటుతో మృతి

By సుభాష్  Published on  19 Jun 2020 1:09 PM IST
విషాదం.. సంచలన దర్శకుడు గుండెపోటుతో మృతి

ఈ మధ్యన సినిమా ఇండస్ట్రీలో ఊహించని విషాదాలు చోటు చేసుకోవడం వల్ల ఇండస్ట్రీలోనే కాకుండా ప్రేక్షకుల్లోనూ కలవరపెడుతున్నాయి. రోజురోజుకు సినీ పరిశ్రమలో పలువురు మృతి చెందడంతో విషాదాలు నెలకొంటున్నాయి. ఇటీవలే కన్నడ హీరో చిరంజీవి సర్జ గుండెపోటుతో మరణించగా, బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూర్‌ ఆత్మహత్య చేసుకోవడం వంటివి ఇండస్ట్రీల్లో విషాదాలు నింపుతున్నాయి. ఇప్పుడు మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల మలయాలలో దేశ వ్యాప్తంగా విడుదలై సంచలన సృష్టించిన 'అయ్యప్పనుమ్‌ కోషియమ్' సినిమా దర్శకుడు ఆర్‌ సచిదానదన్ గుండెపోటుతో మృతి చెందారు. అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఆయనకు ఇటీవల హిప్‌ సర్జరి కూడా జరిగింది. సర్జరీ నుంచి క్రమ క్రమంగా కోలుకుంటుండగా, మూడు రోజులు కిందట కార్డియాక్‌ అరెస్ట్‌ అయ్యింది. గురువారం రాత్రి వరకు వెంటిలేటర్‌పై ఉండి తుది శ్వాస విడిచారు.

Sachidanandan

ఇటీవల మలయాల స్టార్‌ హీరో పృథ్వీ రాజ్‌ సుకుమారన్‌, బిజూ మేనన్‌ నటించిన అయ్యప్పనుమ్ కోషియమ్' మూవీని తెరకెక్కించారు సచిదానందన్‌. ఈ సినిమా అఖండ విజయం సొంతం చేసుకుంది. ఎవరు ఊహించని రీతిలో విజయం సాధించి భారీగా వసూళ్లను రాబట్టింది. కేవలం రూ.5 కోట్లతో సినిమాను తెరకెక్కించగా, రూ.50 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి సంచలన సృష్టించింది. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో దర్శకుడు కాలు నొప్పితో బాధపడ్డారు. మొదట పృథ్వీ రాజ్‌ హీరోగా వచ్చిన 'చాక్లెట్‌' చిత్రానికి స్టోరీని అందించిన సచిదానందన్‌.. 2015లో విడుదలైన 'అనార్కలి' చిత్రంతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు.

Next Story